logo

ఒక్క అవకాశమివ్వండి సేవకుడిలా పనిచేస్తా: తాండ్ర

ఖమ్మం ఎంపీగా ఒక్క అవకాశమిస్తే సేవకుడిగా పనిచేస్తానని భాజపా అభ్యర్థి తాండ్ర వినోదరావు అన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో సోమవారం ప్రచారం చేశారు.

Published : 16 Apr 2024 02:03 IST

రోడ్‌షోలో మాట్లాడుతున్న తాండ్ర వినోదరావు

అశ్వారావుపేట, న్యూస్‌టుడే: ఖమ్మం ఎంపీగా ఒక్క అవకాశమిస్తే సేవకుడిగా పనిచేస్తానని భాజపా అభ్యర్థి తాండ్ర వినోదరావు అన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో సోమవారం ప్రచారం చేశారు. తనను గెలిపిస్తే ప్రజా సమస్యల పరిష్కారం కోసం దిల్లీ వెళ్లి మోదీ నుంచి నిధులు తెచ్చే బాధ్యత తనదని పేర్కొన్నారు. ప్రతి వర్గాన్ని ఆదుకున్న ఘనత భాజపా ప్రభుత్వానికే దక్కుతుందని వివరించారు తాను ఖమ్మం లోక్‌సభ స్థానానికి చెందిన బిడ్డనేనని, ఈ ప్రాంత ప్రజల కష్టాలు తెలుసునని వ్యాఖ్యానించారు. అచ్యుతాపురం సరిహద్దు నుంచి వినోదరావుకు ద్విచక్రవాహనాలు, మేళతాళాలతో ఆపార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు. చంద్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లోని 25గ్రామాల్లో వినోదరావు పర్యటించారు. భాజపా నాయకులు బండారు చంద్రశేఖర్‌, మద్దాల దేవి, శ్రీమంతుల పార్వతి, ఎస్‌వీటీ కొండా, అరవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని