logo

ఖమ్మం జిల్లాలో 14,696.. భద్రాద్రిలో 12,211

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదు క్రతువు సోమవారంతో ముగిసింది. 2024 ఏప్రిల్‌ 1 నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న వారందరూ ఓటరుగా నమోదు చేసుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది.

Published : 17 Apr 2024 03:07 IST

ఈనాడు డిజిటల్‌- కొత్తగూడెం, న్యూస్‌టుడే, ఖమ్మం నగరం: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదు క్రతువు సోమవారంతో ముగిసింది. 2024 ఏప్రిల్‌ 1 నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న వారందరూ ఓటరుగా నమోదు చేసుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఓటరు అనుబంధ జాబితాను ఈనెల 25న వెల్లడించనుంది. ఈ జాబితాలో చోటుదక్కిన వారందరూ మే 13న ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది.

కొనసాగుతున్న పరిశీలన ప్రక్రియ.. నూతనంగా ఓటు నమోదుకు ఫాం-6, ఓటరు చిరునామా మార్చుకోవటానికి ఫాం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. ఈ ఏడాది జనవరి 23న ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రెండు అంశాలపై ఖమ్మం జిల్లాలో 14,696 మంది, భద్రాద్రి జిల్లాలో 12,211 మంది అర్జీలు సమర్పించారు. వీటిని అధికారులు పరిశీలిస్తున్నారు. అర్హత లేని దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. అర్హులకు ఓటుహక్కు కల్పించే పనిలో నిమగ్నమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని