logo

అందుబాటులో ‘అయోధ్య’ తపాలా బిళ్లలు

అయోధ్య రామ జన్మభూమికి సంబంధించిన తపాలా బిళ్లలు ఖమ్మం స్టేషన్‌ రోడ్డులోని ప్రధాన తపాలా కార్యాలయంలో అందుబాటులోకి వచ్చాయి. రామ మందిరానికి చెందిన ఆరు ప్రముఖ చిత్రాలతో ఆరు తపాలా బిళ్లలు ఉన్నాయి.

Published : 18 Apr 2024 05:49 IST

ఖమ్మం సారథినగర్‌, న్యూస్‌టుడే: అయోధ్య రామ జన్మభూమికి సంబంధించిన తపాలా బిళ్లలు ఖమ్మం స్టేషన్‌ రోడ్డులోని ప్రధాన తపాలా కార్యాలయంలో అందుబాటులోకి వచ్చాయి. రామ మందిరానికి చెందిన ఆరు ప్రముఖ చిత్రాలతో ఆరు తపాలా బిళ్లలు ఉన్నాయి. మొత్తం సెట్‌ రూ.వందకు తపాలా కార్యాలయంలో విక్రయిస్తున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం వీటిని కొందరు కొనుగోలు చేశారు. అయోధ్య రామ మందిరం ప్రారంభించిన సందర్భంలో తపాలాశాఖ వీటిని విడుదల చేసింది. ఇప్పటికీ ఖమ్మం చేరాయి.

శ్రీరామనవమికి తపాలా వారధి

భద్రాచలంలో బుధవారం జరిగిన శ్రీసీతారామ కల్యాణ వేడుకలో నేరుగా పాల్గొనలేకపోయిన భక్తులకు, దేవస్థానానికి మధ్య తపాలాశాఖ వారథిగా నిలిచింది. ఈ సదుపాయాన్ని జిల్లాలో 800 మంది వినియోగించుకున్నారు. రూ.450 చెల్లించిన వారికి అంతరాలయంలో పూజ, ప్రసాదం సెట్‌, రూ.150 చెల్లించిన వారికి తలంబ్రాలు, ప్రసాదం అందించనున్నారు. వాటిని భక్తులకు అందించేందుకు తపాలా శాఖ కసరత్తు మొదలు పెట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని