logo

నేడు సీతారాముల పట్టాభిషేకం

శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం మహాపట్టాభిషేకం జరగనుంది. తెల్లవారుజామున 4 గంటలకు ఆలయం తలుపులు తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

Published : 18 Apr 2024 05:56 IST

భద్రాచలం, న్యూస్‌టుడే: శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం మహాపట్టాభిషేకం జరగనుంది. తెల్లవారుజామున 4 గంటలకు ఆలయం తలుపులు తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 10.30 నుంచి 12.30 వరకు కల్యాణ మండపంలో అభిషేక మహోత్సవం ఉంటుంది.

గవర్నర్‌ రాధాకృష్ణన్‌ రాక

మహాపట్టాభిషేకం వేడుకను వీక్షించేందుకు ఇన్‌ఛార్జి గవర్నర్‌ రాధాకృష్ణన్‌ రానున్నారు. బేగంపేట్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఉదయం 8 గంటలకు హెలికాప్టర్‌లో బయల్దేరి 9.15కు భద్రాచలం హెలిప్యాడ్‌లో దిగుతారు. రోడ్డుమార్గాన ఐటీసీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని అల్పాహారం అనంతరం 9.45కు రామాలయానికి వస్తారు. స్వామివారి పట్టాభిషేకాన్ని వీక్షిస్తారు. మధ్యాహ్నం 12.40కు ఐటీసీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని భోజనం చేస్తారు. 2.15కు భద్రాచలం హెలిప్యాడ్‌ నుంచి హైదరాబాద్‌ పయనమవుతారు.

బూర్గంపాడు: గవర్నర్‌ పర్యటన  నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ప్రియాంక అల ఆదేశించారు. సారపాకలోని ఐటీసీ అతిథిగృహంలో సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌, డీఆర్డీఓ విద్యాచందన, జడ్పీ సీఈఓ ప్రసూనరాణి, డీపీఓ చంద్రమౌళి, ఆర్డీఓలు దామోదర్‌రావు, మధు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని