logo

సీతారాములకు ఘనంగా మహదాశీర్వచనం

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో కల్యాణం అనంతరం పట్టాభిషేకాన్ని తిలకించిన భక్తులకు శుక్రవారం సదస్యం పేరిట మరో ఉత్సవం వీక్షించే భాగ్యం దక్కింది.

Published : 20 Apr 2024 01:46 IST

పూజలు అందుకుంటున్న స్వామివారు

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో కల్యాణం అనంతరం పట్టాభిషేకాన్ని తిలకించిన భక్తులకు శుక్రవారం సదస్యం పేరిట మరో ఉత్సవం వీక్షించే భాగ్యం దక్కింది. బహ్మోత్సవాల్లో భాగంగా చతుర్వేదాలతో సీతారాముల వారికి బేడా మండపం వద్ద చేసిన సదస్యం సంబరాన్ని పంచింది. సీతారాముల నూతన జంటకు వేదాలతో పండితులు ఆశీర్వచనం అందించారు. వేద పారాయణాలతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసి భద్రగిరి భక్తగిరిగా మారింది. శనివారం గోదావరిలో స్వామివారికి తెప్పోత్సవం నిర్వహిస్తారు. అదే రోజున చోరోత్సవం చేస్తారు. రామయ్యకు తిరువీధి సేవ ఉంటుందని స్థానాచార్యులు స్థలసాయి, ప్రధానార్చకులు సీతారామానుజాచార్యులు, విజయరాఘవన్‌, ఉప ప్రధానార్చకులు రామస్వరూప్‌ తెలిపారు. 21న ఊంజల్‌సేవ, 22న వసంతోత్సవం, 23న చక్రతీర్థం పూజలు నిర్వహించనున్నారు. 23నే శ్రీపుష్పయాగంతో సంబరాలకు ముగింపు పలకనున్నట్లు ఈవో రమదేవి తెలిపారు.

పల్లకీ మోస్తున్న ఈఓ రమాదేవి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని