logo

ఘనంగా నారా లోకేశ్ జన్మదిన వేడుకలు

మండల కేంద్రమైన సి.బెలగళ్‌లోని ఉద్యాన వనంలో తెదేపా మాజీ కన్వీనర్

Updated : 23 Jan 2022 17:58 IST

సి.బెలగళ్‌ : మండల కేంద్రమైన సి.బెలగళ్‌లోని ఉద్యాన వనంలో తెదేపా మాజీ కన్వీనర్ పాండు రంగన్న గౌడ్‌ ఆధ్వర్యంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి, మండల నాయకులు, కార్యకర్తలకు కేక్‌ ఒకరికొకరు తినిపించుకున్నారు. పార్టీ బలోపేతానికి నారా లోకేశ్ విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. అంతకుముందు ఉద్యానవనంలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ చంద్రశేఖర్‌, ఎంపీటీసీ రవికుమార్, జనరల్‌ సెక్రటరీ నాగరాజు, తిమ్మదొడ్డి కర్రెన్న, దుడ్డన్న తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని