logo

వైకాపా ప్లీనరీ ఖాళీ

కార్యకర్తలు ఎవరూ నిరుత్సాహానికి గురికావొద్దు.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడి అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని వైకాపా కర్నూలు జిల్లా అధ్యక్షుడు వై.బాలనాగిరెడ్డి అన్నారు. పత్తికొండ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం

Published : 28 Jun 2022 02:24 IST

ఫంక్షన్‌హాల్‌ ఆవరణలో ఖాళీగా ఉన్న కుర్చీలు

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: కార్యకర్తలు ఎవరూ నిరుత్సాహానికి గురికావొద్దు.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడి అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని వైకాపా కర్నూలు జిల్లా అధ్యక్షుడు వై.బాలనాగిరెడ్డి అన్నారు. పత్తికొండ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం నియోజకవర్గ ప్లీనరీ సమావేశంలో జరిగింది. పార్టీ అధికారంలో ఉన్నా.. లబ్ధిపొందలేకపోతున్నామనే అసంతృప్తి నుంచి బయటపడాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు.

సభ ప్రారంభమయ్యే సరికి మధ్యాహ్నం ఒంటి గంట కావటంతో ముఖ్యనాయకులు మాట్లాడకముందే కార్యకర్తలు, నాయకులు వెళ్లిపోయారు. బయట వేసిన కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. నేరుగా ఫంక్షన్‌ హాలు వద్దకు రావాలని మొదట సూచించిన పార్టీ వర్గాలు అనంతరం ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్దకు చేరుకొని ర్యాలీగా రావాలని ఆదేశించడటంతో నాయకులు, కార్యకర్తలు గందరగోళానికి గురయ్యారు.

- న్యూస్‌టుడే, పత్తికొండ గ్రామీణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని