logo

బోధనేతర పనులతో మానసిక ఒత్తిడి

ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయులు బోధనేతర పనులతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారని సంఘం నేత జీవీ నారాయణరెడ్డి పేర్కొన్నారు.

Published : 28 Nov 2022 03:08 IST

రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన ఓంకార్‌యాదవ్‌ను సత్కరిస్తున్న సభ్యులు

కర్నూలు(విద్యా విభాగం), న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయులు బోధనేతర పనులతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారని సంఘం నేత జీవీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. నగరంలోని జడ్పీ సమావేశ భవనంలో ఆదివారం ఏపీ ప్రధానోపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ‘రాష్ట్ర స్థాయి విద్యా సదస్సు’ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ లోన్లు తక్షణమే మంజూరుచేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న బీమా సొమ్ము, మెడికల్‌ రీఎంబర్స్‌మెంట్‌ బిల్లులు చెల్లించాలని కోరారు. ప్రతి పాఠశాలకు కంప్యూటర్లు మంజూరు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రధానోపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఓంకార్‌ యాదవ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ప్రధానోపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి 26 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, డీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రత్నం ఏసేపు, డిప్యూటీ డీఈవో హనుమంతరావు, గుత్తి ఉప విద్యాశాఖ అధికారి శంకర్‌ప్రసాద్‌తో పాటు  ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని