logo

వైభవంగా మల్లన్న వెండి రథోత్సవం

శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్ల వెండి రథోత్సవం సోమవారం వైభవంగా జరిగింది.

Published : 29 Nov 2022 02:19 IST

స్వామి, అమ్మవార్లకు వెండి రథోత్సవం నిర్వహిస్తున్న ఈవో, అధికారులు

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే : శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్ల వెండి రథోత్సవం సోమవారం వైభవంగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వెండి రథంపై కొలువుదీర్చి అర్చకులు మంగళ హారతులతో పూజలు నిర్వహించారు. అంతకు ముందు సహస్ర దీపాలంకరణ సేవ శాస్త్రోక్తంగా జరిపించారు.

కొనసాగుతున్న భక్తుల రద్దీ

శ్రీశైల మహాక్షేత్రం సోమవారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో శ్రీగిరికి తరలివచ్చారు. భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. భక్తులతో ఆలయ క్యూ కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి.

మల్లన్న దర్శనానికి వేచి ఉన్న భక్తులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని