బంతి విసిరితె విజయమే
గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు త్రోబాల్ క్రీడలో ప్రతిభ చూపుతున్నారు. ఆటపై ఆసక్తితో పట్టుదలగా నేర్చుకున్నారు.
త్రోబాల్‌లో జాతీయస్థాయికి ఎంపికైన విద్యార్థులు
నంద్యాల పాతపట్టణం, న్యూస్‌టుడే : గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు త్రోబాల్ క్రీడలో ప్రతిభ చూపుతున్నారు. ఆటపై ఆసక్తితో పట్టుదలగా నేర్చుకున్నారు. తక్కువ కాలంలోనే రాష్ట్రస్థాయిలో రాణించి జాతీయస్థాయికి ఎంపికయ్యారు. వీరు బంతి విసిరితే జట్టు గెలుపు బాట పట్టాల్సిందే. ఆటలో నైపుణ్యం చూపుతూ జట్టులోనే తమ స్థానాన్ని పదిలం చేసుకున్నారు.
పూజిత.. గెలుపు ఘనత
నందిపల్లె గ్రామానికి చెందిన రంగేశ్, రమాదేవి దంపతుల కుమార్తె పూజిత. ప్రస్తుతం నంద్యాల పట్టణంలో 8వ తరగతి చదువుతోంది. చిన్నప్పటి నుంచి క్రీడలపై ఇష్టం ఉండటంతో పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు సుబ్బారావు దగ్గర త్రోబాల్‌లో 6వ తరగతి నుంచి శిక్షణ తీసుకుంటోంది. గత రెండేళ్ల నుంచి జిల్లాస్థాయిలో రాణించింది. 2022 డిసెంబరు నెలలో నంద్యాలలో నిర్వహించిన ఎస్‌జీఎఫ్ అండర్-14లో క్రీడల్లో సత్తాచాటి జిల్లా జట్టుకు ఎంపికైంది. ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు విజయంలో కీలకపాత్ర పోషిస్తోంది. ఈ విద్యార్థిని ప్రతిభను గుర్తించి జాతీయస్థాయికి ఎంపిక చేశారు.
శభాష్.. శరత్
టంగుటూరు గ్రామానికి చెందిన భాస్కర్‌రెడ్డి, లక్ష్మిదేవి దంపతుల కుమారుడు శరత్‌కుమార్‌రెడ్డి. ప్రస్తుతం నంద్యాలలో 9వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలలో శిక్షణ పొంది రాష్ట్రస్థాయిలో రాణిస్తున్నాడు. 2021- 22 సంవత్సరంలో నిర్వహించిన పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి స్మారక జిల్లాస్థాయి త్రోబాల్ పోటీల్లో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. గతేడాది డిసెంబరులో జరిగిన పోటీల్లో ప్రతిభ చూపి అండర్-14 జిల్లా జట్టుకు ఎంపికయ్యాడు. ప్రస్తుతం గురురాజ పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్న ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చూపడం ద్వారా జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
గాల్లో అతి సమీపంలోకి వచ్చిన విమానాలు
-
Crime News
Crime News : కుమార్తెను చంపి ‘కరెంట్ షాక్’ నాటకం
-
Ap-top-news News
Andhra News: ఆసుపత్రి భవనానికి వైకాపా రంగులు..!
-
India News
పానీపూరీ అమ్ముతున్న లేడీ డాక్టర్!.. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే
-
Politics News
నన్ను ఓడించేందుకు ప్రయత్నాలు జరిగాయి: మంత్రి పువ్వాడ అజయ్
-
Ts-top-news News
ఉచిత వై-ఫైతో ఏసీ స్లీపర్ బస్సులు