logo

ప్రశాంతంగా బీసీ ఆర్జేసీ సెట్‌

బీసీ గురుకుల బాలికల పాఠశాలల్లో ఇంటర్మీడియట్‌లో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన ఎంజేపీ ఏపీ బీసీ ఆర్జేసీ సెట్‌- 2023 ప్రశాంతంగా జరిగినట్లు ప్రిన్సిపల్‌ జయమ్మ తెలిపారు.

Published : 29 May 2023 03:44 IST

పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులను తనిఖీ చేసి పంపుతున్న సిబ్బంది

పాణ్యం గ్రామీణం, న్యూస్‌టుడే : బీసీ గురుకుల బాలికల పాఠశాలల్లో ఇంటర్మీడియట్‌లో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన ఎంజేపీ ఏపీ బీసీ ఆర్జేసీ సెట్‌- 2023 ప్రశాంతంగా జరిగినట్లు ప్రిన్సిపల్‌ జయమ్మ తెలిపారు. మండలంలోని నెరవాడ మెట్ట వద్ద ఉన్న బీసీ గురుకుల బాలికల పాఠశాలలో ఉదయం 10.30 నుంచి ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించారు. 597 మందికిగాను 445 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆదివారం ఉదయం విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు పెద్దఎత్తున పరీక్ష కేంద్రం వద్దకు చేరుకున్నారు. పాఠశాల వద్ద జాతీయ రహదారి సర్వీసు రోడ్డుపై మొక్కజొన్న దిగుబడులు ఆరబోయడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. కేంద్రం వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో ఎండ వేడిమి భరించలేక తల్లిదండ్రులు అవస్థలు పడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు