logo

రేషన్ బియ్యం పట్టివేత

మండలంలోని ముండ్లదిన్నె గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Published : 17 Apr 2024 19:33 IST

రాజోలి: మండలంలోని ముండ్లదిన్నె గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ జగదీశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మల్లిఖార్జున్ అనే వ్యక్తి ప్రజల నుంచి తక్కువ ధరకు రేషన్ బియ్యం కొనుగోలు చేసి కర్నూలు, రాయచూర్ ప్రాంతాలకు తరలిస్తుంటాడు. ఇందులో భాగంగానే ఈ నెలకు సంబంధించిన రేషన్ తన ఇంటి వద్ద నిల్వ ఉంచాడు. సమచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించి, 10 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని