logo

విశ్వశాంతి ఉత్సవం.. పరిసమాప్తం

సిద్దిపేటలో విశ్వశాంతి మహాయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా ముగిసింది. శ్రీకృష్ణపీఠాధిపతి కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి నేతృత్వంలో 14 రోజుల పాటు కొనసాగిన మహాక్రతువుకు పూర్ణాహుతితో ముగింపు పలికారు.

Published : 03 Dec 2022 01:23 IST

పూర్ణాహుతి చేపడుతున్న కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి

సిద్దిపేట, న్యూస్‌టుడే: సిద్దిపేటలో విశ్వశాంతి మహాయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా ముగిసింది. శ్రీకృష్ణపీఠాధిపతి కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి నేతృత్వంలో 14 రోజుల పాటు కొనసాగిన మహాక్రతువుకు పూర్ణాహుతితో ముగింపు పలికారు. సిద్దిపేట సహా వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు నిత్యం వేలాది మంది తరలిరాగా యాగ స్థలి కిక్కిరిసింది. శ్రీకృష్ణ కాలచక్రం పేరిట.. చేపట్టిన యాగంలో అయుత చండీ, అతిరుద్రం, చతుర్వేద పూర్వక మహాగణపతి, మహాసౌర, సుదర్శన, ఇతర హోమాలు జరిగాయి. వివిధ దేవతామూర్తుల కల్యాణాలు కనువిందు చేశాయి. శుక్రవారం గురుపూజ, అవబృధ స్నానం, ఉట్టికొట్టడం, రాధాకృష్ణ శాంతి కల్యాణం చేపట్టారు. రాత్రి పొద్దుపోయే వరకు ఆయా కార్యక్రమాలు జరిగాయి. చివరి రోజు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కుంకుమార్చన, శివాభిషేకాలు చేశారు. స్వామి ఆశీర్వచనం అందజేశారు.

165 అడుగుల రాధాకృష్ణ  విగ్రహంతో మందిర నిర్మాణం..

మహా పూర్ణాహుతికి ముందు అయుత చండీ, అతిరుద్ర హోమాల్లో మంత్రి హరీశ్‌రావు, శ్రీనిత దంపతులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేటలో 165 అడుగుల పాలరాతి రాధాకృష్ణ విగ్రహంతో కూడిన మందిరం నిర్మిస్తామని, వచ్చే ఫిబ్రవరిలో పనులకు అంకురార్పణ చేస్తామని ప్రకటించారు. మహాయాగంతో రాష్ట్రం, దేశం అభివృద్ధి సాధించాలని, ప్రజలంతా సుబిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, తితిదే పాలక మండలి సభ్యుడు మురంశెట్టి రాములు తదితరులు పాల్గొన్నారు.

హోమంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు దంపతులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు