logo

గట్టి పోటీ.. ఓటమితో సరిపెట్టి

ఎన్నికల్లో గెలుపోటములను ప్రధాన పార్టీల అభ్యర్థులే శాసిస్తారని అంతా భావిస్తుంటారు. కానీ ఒక్కోసారి తిరుగుబావుట ఎగురేసి బరిలోకి దిగిన వారూ ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. అభ్యర్థులకు ఓట్లు దక్కకుండా చీలుస్తుంటారు.

Published : 14 Nov 2023 02:05 IST

న్యూస్‌టుడే, చేగుంట : ఎన్నికల్లో గెలుపోటములను ప్రధాన పార్టీల అభ్యర్థులే శాసిస్తారని అంతా భావిస్తుంటారు. కానీ ఒక్కోసారి తిరుగుబావుట ఎగురేసి బరిలోకి దిగిన వారూ ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. అభ్యర్థులకు ఓట్లు దక్కకుండా చీలుస్తుంటారు. దీనివల్ల గెలుపు తారుమారవుతుంటుంది.

  • 1999లో రామాయంపేట నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి అంతిరెడ్డిగారి విఠల్‌రెడ్డి, తెదేపా తరఫున దేవర వాసుదేవరావు, అన్న తెలుగుదేశం నుంచి తీగల వెంకటగౌడ్‌ బరిలోకి దిగారు. వాసుదేవరావు తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి విఠల్‌రెడ్డి చేతిలో 2 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. తీగల వెంకటగౌడ్‌కు 5 వేల ఓట్లు వచ్చాయి. అవన్నీ తెదేపాకు చెందినవే. ఆఎన్నికల్లో వెంకటగౌడ్‌ విబేధించకుండా తెదేపాకు మద్దతిచ్చి ఉంటే వాసుదేవరావుకు గెలుపు దక్కేది.
  • 2009లో దుబ్బాక నుంచి చెరుకు ముత్యంరెడ్డి (కాంగ్రెస్‌), సోలిపేట రామలింగారెడ్డి (భారాస), మద్దుల నాగేశ్వర్‌రెడ్డి (పీఆర్పీ)లు పోటీ చేశారు. నాగేశ్వర్‌రెడ్డికి 19 వేల ఓట్లు వచ్చాయి. ఎక్కువగా తెరాసకు చెందిన గ్రామాల నుంచి ఓట్లు సాధించారు. రామలింగారెడ్డి కేవలం 2,500 ఓట్ల మెజారిటీతో ఓటమి చెందారు.
  • 2020 దుబ్బాక ఉప ఎన్నికల్లో తెరాస నుంచి సోలిపేట సుజాత, భాజపా నుంచి రఘునందన్‌రావు, కాంగ్రెస్‌ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి పోటీ చేశారు. రఘునందన్‌రావు కేవలం 1200 ఓట్ల తేడాతో సుజాతపై గెలుపొందారు. మూడో స్థానంలో ఉన్న శ్రీనివాస్‌రెడ్డికి 22 వేల ఓట్లు వచ్చాయి. శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌ కంటే ముందు భారాసలో పని చేశారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని