logo

నిందితులను అరెస్టు చేయండి

అంబేడ్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ బక్కి వెంకటయ్య అన్నారు

Updated : 20 Apr 2024 05:52 IST

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌  

 

అంబేడ్కర్‌ విగ్రహం వద్ద మాట్లాడుతున్న బక్కి వెంకటయ్య

రామాయంపేట, న్యూస్‌టుడే: అంబేడ్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ బక్కి వెంకటయ్య అన్నారు. రామాయంపేట మండల పరిధి ఆర్‌ వెంకటాపూర్‌ గ్రామంలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై శుక్రవారం ఆయన గ్రామాన్ని సందర్శించి దళిత సంఘం సభ్యులు, నాయకులతో చర్చించారు. చట్టం తన పనితాను చేసుకుపోతుందని గ్రామంలో ఘర్షణ వాతావరణం సరికాదన్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయకపోవడం వల్లే గ్రామంలో సమస్యలు నెలకొన్నాయన్నారు. అరెస్టు చేయకుంటే ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ తరఫున చర్యలు చేపడతామన్నారు. ఎన్నికల అనంతరం సామరస్య పూర్వకంగా గ్రామస్థులందరితో కలిసి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందామని, అప్పటివరకు సంయమనం పాటించాలని కోరారు. ఎమ్మార్పీఎస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు మాసాయిపేట యాదగిరి, జిల్లా అధ్యక్షుడు గరుగుల శ్రీనివాస్‌, జైభీమ్‌ జిల్లా అధ్యక్షుడు రాజు, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మాసాయిపేట మల్లేశం ఉన్నారు.

 బాధ్యులపై కేసు నమోదు చేయండి: మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు శుక్రవారం ఆర్‌ వెంకటాపూర్‌ గ్రామాన్ని సందర్శించారు. ధ్వంసమైన అంబేడ్కర్‌ విగ్రహాన్ని పరిశీలించారు. ఘటనకు బాధ్యులైన వారిని శిక్షించాలని పోలీసులకు సూచించారు. ఎన్నికల అనంతరం విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందామన్నారు. నాయకులు సుప్రభాత రావు, రమేష్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని