logo

స్థానం..25

పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో జిల్లా వ్యాప్తంగా బాలికలు తమ ప్రతిభను చాటారు. అత్యధికంగా పది గ్రేడు పాయింట్లు సాధించి అగ్రభాగాన నిలిచారు.

Published : 01 May 2024 05:54 IST

 జిల్లాలో  90.44 శాతం ఉత్తీర్ణత 

భువనగిరి పట్టణం, న్యూస్‌టుడే: పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో జిల్లా వ్యాప్తంగా బాలికలు తమ ప్రతిభను చాటారు. అత్యధికంగా పది గ్రేడు పాయింట్లు సాధించి అగ్రభాగాన నిలిచారు. జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల పాఠశాలల పరిధిలో 9,108 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 8,237 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 4,205 మంది బాలికలు, 4,032 మంది బాలురు ఉన్నారు. జిల్లా ఉత్తీర్ణత శాతం 90.44 నమోదైంది. ప్రస్తుత ఫలితాల్లో 25వ స్థానానికి పరిమితమైంది. విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు పదో తరగతిలో విద్యాశాఖ పలు వినూత్న కార్యక్రమాలు అమలు పర్చినప్పటికి ఆశించిన ఫలితాలు దక్కకపోవడం గమనార్హం.

  పది గ్రేడ్‌ పాయింట్లు వీరికే..

జిల్లా వ్యాప్తంగా 192 ప్రభుత్వ, రెసిడెన్షియల్‌ పదో తరగతి పాఠశాలలు, 75 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. పది గ్రేడు పాయింట్లను సాధించడంలో పలు ప్రైవేటు పాఠశాలలదే పైచేయిగా మారింది. జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని 68 మంది విద్యార్థులు పది జీపీఏ సాధించారు. 31 ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు పది గ్రేడు పాయింట్లు సాధించారని విద్యాశాఖాధికారులు తెలిపారు. భువనగిరి మైనార్టీ గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు, రఘునాథ్‌పూర్‌, కొయ్యలగూడెం జడ్పీ పాఠశాల విద్యార్థులు ఇద్దరు పది గ్రేడ్‌ పాయింట్‌ సాధించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని