logo

మలేరియా నివారణకు కృషి

మలేరియా నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఇన్‌ఛార్జి డీఎంహెచ్‌వో వెంకటప్రసాద్‌ తెలిపారు. మలేరియా నివారణ మాసోత్సవ సందర్భంగా గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి జరిగిన ర్యాలీని ప్రారంభించారు.

Published : 02 Jun 2023 02:27 IST

ర్యాలీని ప్రారంభిస్తున్న ఇన్‌ఛార్జి డీఎంహెచ్‌వో వెంకటప్రసాద్‌

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే: మలేరియా నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఇన్‌ఛార్జి డీఎంహెచ్‌వో వెంకటప్రసాద్‌ తెలిపారు. మలేరియా నివారణ మాసోత్సవ సందర్భంగా గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి జరిగిన ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి హుస్సేనమ్మ, ఆర్‌బీఎస్‌కే జిల్లా కోఆర్డినేటర్‌ డాక్టర్‌ సుధీర్‌కుమార్‌, డాక్టర్లు ప్రమోద్‌, సునీల్‌, డెమో బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. రక్తహీనత ఉన్న చిన్నారులను గుర్తించి జాబితా తయారు చేయాలని ఇన్‌ఛార్జి డీఎంహెచ్‌వో జి.వెంకటప్రసాద్‌ తెలిపారు. నగరంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ, ఐసీడీఎస్‌ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 10వ తేదీ లోపు అంగన్‌వాడీ కేంద్రాల్లో బరువు నమోదు చేయాలన్నారు. సమావేశంలో ఐసీడీఎస్‌ పీడీ సౌజన్య, అసిస్టెంట్‌ డ్రగ్‌ కంట్రోలర్‌ వీరకుమార్‌రెడ్డి, ఎఫ్‌పీసీ పీవో పీఎల్‌ దయాకర్‌, డీపీఎమ్‌వో డాక్టర్‌ హరిశ్చంద్ర సతీష్‌, ఎన్‌సీడీ పీవో డాక్టర్‌ సుధీర్‌కుమార్‌, ఎమ్‌వో డాక్టర్‌ సునీల్‌, ఐఏపీ పీడియాట్రిషీయన్‌ సురేష్‌బాబు, డాక్టర్‌ ఆమని, డీపీహెచ్‌ఎన్‌వో మంజుల, డిప్యూటీడెమో కనకరత్నం పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని