logo

చర్చనీయాంశంగా సీఐల బదిలీ

కమిషనరేట్‌లో ముగ్గురు సీఐల బదిలీ అంశం చర్చనీయాంశంగా మారింది. సొంత జిల్లాల్లో పనిచేస్తున్నందున బోధన్‌ రూరల్‌ సీఐ రవీందర్‌ నాయక్‌ను సిద్దిపేట్‌, నిజామాబాద్‌ సౌత్‌ రూరల్‌ సీఐ నరేశ్‌, సీసీఎస్‌ సీఐ గోపినాథ్‌ను మెదక్‌కు బదిలీ చేస్తూ

Published : 20 May 2022 03:10 IST

స్థానికత కారణంగా ముగ్గురికి..
న్యూస్‌టుడే - ఇందూరు సిటీ

కమిషనరేట్‌లో ముగ్గురు సీఐల బదిలీ అంశం చర్చనీయాంశంగా మారింది. సొంత జిల్లాల్లో పనిచేస్తున్నందున బోధన్‌ రూరల్‌ సీఐ రవీందర్‌ నాయక్‌ను సిద్దిపేట్‌, నిజామాబాద్‌ సౌత్‌ రూరల్‌ సీఐ నరేశ్‌, సీసీఎస్‌ సీఐ గోపినాథ్‌ను మెదక్‌కు బదిలీ చేస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్ర పోలీసు శాఖలోనే తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇటీవల జోన్ల విభజనలో భాగంగా వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న సీఐలు కమిషనరేట్‌కు వచ్చారు. వీరిలో నరేశ్‌కు నిజామాబాద్‌ సౌత్‌ రూరల్‌, గోపినాథ్‌కు సీసీఎస్‌లో పోస్టింగు ఇచ్చి నార్త్‌ సర్కిల్‌ ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పజెప్పారు. బోధన్‌ రూరల్‌ సీఐగా రవీందర్‌ నాయక్‌ గత రెండేళ్లుగా కొనసాగుతున్నారు.
ఆపాలని విన్నపాలు..
తాజా బదిలీలను ఆపాలని.. తాము స్పౌజ్‌ కోటాకు అర్హులమంటూ ఇద్దరు సీఐలు ఐజీకి విన్నవించుకున్నారు. మరొకరు అనారోగ్య కారణాలతో సొంత జిల్లాకు వచ్చానని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో తదుపరి ఉత్తర్వుల అమలు ఎలా ఉంటుందోనని ఆసక్తికరంగా మారింది.
పలువురు ఎస్సైలు..
ఇందూరు సిటీ: కమిషనరేట్‌లో పలువురు ఎస్సైలను బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆర్మూర్‌లో పనిచేస్తున్న యాదగిరి గౌడ్‌ను మాక్లూర్‌కు, ఇక్కడ ఉన్న పెంటాగౌడ్‌ సీసీఆర్‌బీకి బదిలీ అయ్యారు. నిజామాబాద్‌ ఒకటో ఠాణాలోని సాయికుమార్‌ను ఆరో ఠాణాకు, ఇక్కడ పనిచేస్తున్న ఆంజనేయులును ట్రాఫిక్‌కు, వీఆర్‌లో ఉన్న శ్రవణ్‌ను ఒకటో ఠాణాకు, ట్రాఫిక్‌ నుంచి ప్రదీప్‌ను ఆర్మూర్‌కు కేటాయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని