logo

భూ కబ్జాలపై పోరాటం ఆగదు

జిల్లాకేంద్రం శివార్లలో ఆయా పార్టీల నేతల భూకబ్జాలపై తన పోరాటం ఆగదని భాజపా నియోజకవర్గ బాధ్యుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 20 May 2022 03:10 IST

భాజపా జిల్లా కార్యాలయంలో మాట్లాడుతున్న వెంకటరమణారెడ్డి

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాకేంద్రం శివార్లలో ఆయా పార్టీల నేతల భూకబ్జాలపై తన పోరాటం ఆగదని భాజపా నియోజకవర్గ బాధ్యుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కామారెడ్డి ప్రాంతంలో చేసిన వెంచర్లను స్కీముల పేరిట విక్రయించి ఇప్పటికీ ప్లాట్లు చూపించడం లేదన్నారు. స్నేహపురికాలనీ వద్ద అసైన్డ్‌ భూమిలో చేసిన వెంచర్‌ను గత కలెక్టర్‌ స్వాధీనం చేసుకోవడంతో 250 మంది కొనుగోలుదారులు రోడ్డున పడ్డారన్నారు. తాజాగా కృష్ణాజివాడి పంచాయతీ పరిధిలోని అబ్దుల్లానగర్‌లో అక్రమ వెంచర్‌ నిర్మిస్తున్నారన్నారు. దీని వెనుక బడా నాయకులు ఉన్నారని ఆరోపించారు. 160 ఎకరాలకు పైగా అసైన్డ్‌, పట్టాభూముల్లో 3,400 ప్లాట్లు చేసి అమ్మకానికి పెట్టారన్నారు. ఇక్కడికి వెళ్లడానికి వేసిన 5 కి.మీ రోడ్డును ప్రభుత్వ డబ్బుతో వేశారా? ప్రైవేటు వ్యక్తులు వేసుకున్నారా? అనే దానిపై ఎమ్మెల్యే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. చెరువుకట్టపై రోడ్డు ఎలా వేశారో జలవనరులశాఖ అధికారులు సమాధానం చెప్పాలని కోరారు. అక్రమ లేఅవుట్లపై జిల్లా కలెక్టర్‌ స్పందించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తేలు శ్రీను, అసెంబ్లీ కన్వీనర్‌ కుంట లక్ష్మారెడ్డి, జిల్లా నాయకుడు ఆకుల భరత్‌, కౌన్సిలర్లు మోటూరి శ్రీకాంత్‌, శ్రీనివాస్‌, నరేందర్‌, రవి, ప్రవీణ్‌ నాయకులు మోహన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని