logo

‘ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యం’

ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన నిఖత్‌ జరీన్‌.. రానున్న ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తుందని సంఘం జిల్లా కార్యదర్శి, శిక్షకుడు సంసముద్దీన్‌ అన్నారు

Published : 21 May 2022 06:27 IST

డీఎస్‌ఏ మైదానంలో సంబరాలు చేస్తున్న క్రీడాకారులు

నిజామాబాద్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన నిఖత్‌ జరీన్‌.. రానున్న ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తుందని సంఘం జిల్లా కార్యదర్శి, శిక్షకుడు సంసముద్దీన్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీఎస్‌ఏ మైదానంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. శిక్షణ ఇచ్చేటప్పటి నుంచి నిఖత్‌ సమయపాలన పాటించేదన్నారు. అంశం ఏదైనా సులువుగా అర్థం చేసుకునేదన్నారు. అనంతరం స్వీట్లు పంచుకుని, టపాకాయలు పేల్చి ఆనందం వ్యక్తం చేశారు. డీవైఎస్‌వో ముత్తెన్న, సంఘం అధ్యక్షుడు అక్బర్‌, ఖైసర్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని