logo

దారి లేక దూరి.. ప్రమాదాల దరి చేరి

భిక్కనూరు మండలం జంగంపల్లి శివారు బీటీఎస్‌ చౌరస్తా వద్ద ప్రయాణికులు దారి కోసం నానా తిప్పలు పడుతున్నారు. ఇటీవల పోలీసులు, జాతీయ రహదారి అధికారులు కలిసి రోడ్డు ప్రమాదాలపై సర్వే

Published : 23 May 2022 04:55 IST

న్యూస్‌టుడే, భిక్కనూరు : భిక్కనూరు మండలం జంగంపల్లి శివారు బీటీఎస్‌ చౌరస్తా వద్ద ప్రయాణికులు దారి కోసం నానా తిప్పలు పడుతున్నారు. ఇటీవల పోలీసులు, జాతీయ రహదారి అధికారులు కలిసి రోడ్డు ప్రమాదాలపై సర్వే నిర్వహించి ప్రమాదాలకు ఆస్కారమున్న మార్గాలను మూసివేశారు. ఇందులో భాగంగా బీటీఎస్‌ వద్ద జాతీయ రహదారిపైకి వెళ్లి వచ్చే చిన్నపాటి సందును రెయిలింగ్, సిమెంటు బ్రిక్స్‌తో మూసివేశారు. దోమకొండ, బీబీపేట మండలాల ప్రజలు హైదరాబాద్‌ వెళ్లాలంటే జాతీయ రహదారిపైకి వెళ్లి బస్సులు ఎక్కుతారు. ప్రస్తుతం దారి మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూసివేసిన దారికి కొంత దూరంలోనే ఇనుప కంచెను తొలగించి ప్రమాదకరంగా అందులో దూరి వెళ్తున్నారు. ప్రమాదాల నివారణకు పోలీసులు చర్యలు చేపడితే వాటిని లెక్కచేయకుండా మరో దారి వెతుక్కుంటున్నారు. ఇటీవల ఇక్కడ హైలెవల్‌ వంతెన ఏర్పాటు చేయాలని ఎంపీ బీబీ పాటిల్‌కు స్థానిక నాయకులు వినతిపత్రం అందించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని