logo

హ్యాట్రిక్‌ వీరులు ఇద్దరు

నిజామాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇద్దరు వ్యక్తులు వరుసగా మూడు సార్లు గెలుపొంది హ్యాట్రిక్‌ సాధించారు. 1952లో హరీశ్‌ చంద్ర హెడా కాంగ్రెస్‌ తరఫున విజయం సాధించి మొదటి సారి లోక్‌సభ సభ్యుడిగా అడుగు పెట్టారు.

Updated : 19 Apr 2024 06:18 IST

నిజామాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇద్దరు వ్యక్తులు వరుసగా మూడు సార్లు గెలుపొంది హ్యాట్రిక్‌ సాధించారు. 1952లో హరీశ్‌ చంద్ర హెడా కాంగ్రెస్‌ తరఫున విజయం సాధించి మొదటి సారి లోక్‌సభ సభ్యుడిగా అడుగు పెట్టారు. 1957, 1964లో వరుస విజ యాలతో ఆయన మూడు సార్లు ఎంపీ అయ్యారు. 1967లో నాలుగో సారి పోటీ చేసినప్పటికీ ఓటమి చెందారు. కాంగ్రెస్‌ తరఫున ఎం.రాంగోపాల్‌రెడ్డి వరుసగా 1971, 1977, 1980 పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఆయన కూడా కాంగ్రెస్‌ నుంచే ప్రాతినిధ్యం వహించారు. ఎం.రాంగోపాల్‌రెడ్డి బోధన్‌ నియోజకవర్గం నుంచి 1962-67 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. తెదేపా నుంచి గడ్డం గంగారెడ్డి మూడు సార్లు ఎంపీగా పని చేశారు. మొదట ఆయన 1991 సంవత్సరంలో విజయం సాధించారు. 1996లో గంగారెడ్డికి తెదేపా టికెట్‌ కేటాయించలేదు. తర్వాత 1998, 1990 సంవత్సరంలో తెదేపా తరఫున పోటీ చేసి గెలిచారు. ఆయనకు హ్యాట్రిక్‌కు మధ్యలో బ్రేక్‌ పడింది.

 న్యూస్‌టుడే, నిజామాబాద్‌ అర్బన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని