logo

రెడ్‌క్రాస్‌ నూతన కార్యవర్గం ఎన్నిక

ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జరిగింది. డీఆర్వో ఎం.గణపతిరావు పర్యవేక్షణలో బడ్జెట్‌ వివరాలు, గత మూడేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సేవా కార్యక్రమాలపై చర్చించారు.

Published : 26 Mar 2023 06:01 IST

సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న డీఆర్వో గణపతిరావు

కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జరిగింది. డీఆర్వో ఎం.గణపతిరావు పర్యవేక్షణలో బడ్జెట్‌ వివరాలు, గత మూడేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సేవా కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం 13 మందితో కూడిన నూతన నిర్వాహక కమిటీ ఎన్నికైంది. ఛైర్మన్‌గా కేఆర్‌డీ.ప్రసాదరావు, వైస్‌ ఛైర్మన్‌గా ఆర్‌.రాజగోపాల్‌నాయుడు, కోశాధికారిగా టి.రామారావుతోపాటు ఇతర సభ్యులను ఎన్నుకున్నారు. రాష్ట్ర వైస్‌ ఛైర్మన్‌ పి.జగన్మోహనరావు, విశాఖపట్నం ఛైర్మన్‌ శివనాగేందర్‌రెడ్డి హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని