logo

పట్టా పుట్టించారు.. సాయం పెంచేశారు

ఓట్ల వేటలో భాగంగా ప్రజలను ఆకట్టుకునేందుకు లేని పట్టాలను పుట్టిస్తోంది వైకాపా ప్రభుత్వం. వివిధ పథకాల కింద అందిన సొమ్ము సైతం ఎక్కువ అందినట్లు చెబుతూ ప్రచారం చేసుకుంటోంది.

Published : 19 Mar 2024 03:19 IST

వినతిపత్రం అందజేస్తున్న కె.రమణ 

పాలకొండ, న్యూస్‌టుడే: ఓట్ల వేటలో భాగంగా ప్రజలను ఆకట్టుకునేందుకు లేని పట్టాలను పుట్టిస్తోంది వైకాపా ప్రభుత్వం. వివిధ పథకాల కింద అందిన సొమ్ము సైతం ఎక్కువ అందినట్లు చెబుతూ ప్రచారం చేసుకుంటోంది. ఈ పరిస్థితి పాలకొండ పట్టణంలోని వీవర్స్‌ కాలనీలో నివాసముంటున్న కనకం రమణకు ఎదురైంది. దీంతో అవాక్కైన ఆయన అధికారులను కలవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.  బాధితుడి వివరాల ప్రకారం.. ప్రభుత్వం కొన్ని రోజులుగా గడప గడపకూ సంక్షేమం పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రమణకు రూ.6 లక్షలు విలువ చేసే ఇంటి స్థలం ఇచ్చినట్లు ఆయన కుటుంబానికి ప్రత్యేక పత్రం అందజేశారు. దానిపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చిత్రంతో పాటు ఆయన సంతకం సైతం ఉంది. వాస్తవానికి ఆయనకు స్థలం మంజూరు కాలేదు. దీంతో సోమవారం సంక్షేమ పత్రంలో పేర్కొన్న మేరకు తనకు ఇంటి స్థలం ఇవ్వాలంటూ సచివాలయ సిబ్బందికి వినతిపత్రం సమర్పించారు. అలాగే వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం కింద తనకు రూ.96 వేలు అందినట్లు చూపారని, కానీ వాస్తవానికి మూడు విడతల్లో రూ.72 వేలు మాత్రమే వచ్చిందని వివరించారు. సాంకేతిక కారణాలతో పత్రాల్లో తప్పులు దొర్లాయని సచివాలయ సంక్షేమ సహాయకుడు రాజీవ్‌ తెలిపారు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.

ప్రభుత్వం ఇచ్చిన పత్రం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని