logo

ఈ కష్టాలు ఎప్పుడు తీరేనో..?

Published : 19 Mar 2024 03:56 IST

న్యూస్‌టుడే, కొమరాడ: పరీక్షలు అంటే కొమరాడ మండలంలోని పలు గ్రామాల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పరీక్ష రాయడం కాకుండా.. కేంద్రానికి చేరుకోవడం వారికి కష్టంగా మారింది. ఇటీవల ఇంటర్మీడియట్‌ విద్యార్థులను వేధించిన సమస్య మళ్లీ ఇప్పుడు పది విద్యార్థులకు ఎదురైంది. నాగావళి నది ఆవల ఉన్న కొట్టు, తొడుములో చదువుతున్న వారికి కొమరాడ పరీక్ష కేంద్రంగా ఇచ్చారు. కానీ ఇక్కడ పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణం పూర్తికాకపోవడంతో విద్యార్థులు నదిలో నడిచి వచ్చారు. ఉదయం 9.30 గంటలకు కేంద్రానికి చేరాల్సి ఉండగా, ఏడు గంటలకే ఇళ్ల నుంచి బయలు దేరాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని