logo

బిందెడు నీటికి ఎన్ని బాధలో..

పార్వతీపురం మండలంలోని చినబొండపల్లిలో పరిస్థితి ఇది. గ్రామంలో ఇంటికో కుళాయి వేశారు. డి.శిర్లాం పైలెట్‌ ప్రాజెక్టు నుంచి నీరు సరఫరా చేసేవారు.

Published : 19 Mar 2024 03:58 IST

న్యూస్‌టుడే, పార్వతీపురం: పార్వతీపురం మండలంలోని చినబొండపల్లిలో పరిస్థితి ఇది. గ్రామంలో ఇంటికో కుళాయి వేశారు. డి.శిర్లాం పైలెట్‌ ప్రాజెక్టు నుంచి నీరు సరఫరా చేసేవారు. కానీ రోడ్డు విస్తరణలో భాగంగా పైపులు దెబ్బతిన్నాయి. పునరుద్ధరణ జరిగినా పూర్తిస్థాయిలో అమర్చకపోవడంతో గతంలో ఉన్న ట్యాంకు నుంచి సరఫరా చేసేందుకు నిర్ణయించారు. కానీ సరిపడా నీరు రాకపోవడంతో ప్రజలు ఇలా రోడ్డెక్కి బిందెలతో నీటి కోసం తంటాలు పడుతున్నారు. గ్రామంలో ఓ పైపు వద్ద లీకవుతున్న నీరు పట్టుకునేందుకు పడిగాపులు కాస్తున్నారు.  దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ బసవరాజు వద్ద ప్రస్తావించగా.. పైపులు పాడయ్యాయని, మరమ్మతులు చేస్తున్నామని తెలిపారు. మంగళవారం సమస్య పరిష్కరిస్తామన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని