icon icon icon
icon icon icon

Chandrababu: జగన్‌ పాలనలో దేవాలయాలకు రక్షణ లేదు: చంద్రబాబు

 జగన్‌ పాలనలో దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు.

Published : 24 Apr 2024 19:13 IST

నెల్లిమర్ల: జగన్‌ పాలనలో దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. జగన్‌.. ఉత్తరాంధ్ర ద్రోహిగా మిగిలారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతకు 20లక్షల ఉద్యోగాలు ఇస్తాం.. అధికారంలో వచ్చిన వెంటనే మెగా డీఎస్సీపైనే తొలి సంతకం చేస్తానని హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో తెదేపా, జనసేన నిర్వహించిన ఉమ్మడి ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడారు.  రూ.4వేలు చొప్పున వృద్ధాప్య పింఛను ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటి వద్దే అందిస్తామని ప్రకటించారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఏదో ఒక నాటకం ఆడటం జగన్‌కు అలవాటుగా మారిందని, ఈసారి గులకరాయి డ్రామా ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. 

‘‘నెల్లిమర్లలో కొండలన్నీ వైకాపా అనకొండ మింగిసింది.  మేం వచ్చిన వెంటనే ఉత్తరాంధ్ర, సుజల స్రవంతి పూర్తి చేస్తాం. అతిపెద్ద ఇండస్ట్రియల్‌ హబ్‌గా ఈ ప్రాంతం తయారవుతుంది. మా సభలకు వస్తున్న స్పందన చూసి వైకాపా నేతల్లో ఆందోళన మొదలైంది. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా వైకాపా నేతలకు డిపాజిట్లు రావు. వైకాపా పాలనలో 160 దేవాలయాలపై దాడులు చేశారు. ఈ ఐదేళ్లలో ఉత్తరాంధ్రకు ఒక్క ప్రాజెక్టు తెచ్చారా? ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేశారా? ఉత్తరాంధ్ర బాగు కోసమే భోగాపురం విమానాశ్రయం తెచ్చాం. మేం ఉంటే భోగాపురం ఎయిర్‌పోర్టు ఇప్పటికే పూర్తయ్యేది’’ అని చంద్రబాబు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img