icon icon icon
icon icon icon

జగన్‌.. శవ రాజకీయాలకు చిరునామా

‘ప్రతి సారీ ఎన్నికల ముందు జగన్‌ శవరాజకీయం చేస్తున్నారు. తండ్రి శవాన్ని చూపించి సీఎం కావాలనుకున్నారు. కోడికత్తి డ్రామాతో మరోసారి తెర మీదకు వచ్చారు. బాబాయ్‌ని చంపించి సానుభూతితో గెలిచారు.

Published : 06 May 2024 05:48 IST

ఏలూరు యువగళం సభలో లోకేశ్‌

ఈనాడు, ఏలూరు: ‘ప్రతి సారీ ఎన్నికల ముందు జగన్‌ శవరాజకీయం చేస్తున్నారు. తండ్రి శవాన్ని చూపించి సీఎం కావాలనుకున్నారు. కోడికత్తి డ్రామాతో మరోసారి తెర మీదకు వచ్చారు. బాబాయ్‌ని చంపించి సానుభూతితో గెలిచారు. ఇప్పుడు గులకరాయి నాటకం మొదలుపెట్టారు. పింఛన్లు ఇంటి దగ్గర ఇచ్చే అవకాశం ఉన్నా 32 మందిని పొట్టన పెట్టుకుని మళ్లీ శవరాజకీయం మొదలుపెట్టారు. జగన్‌ శవరాజకీయాలకు చిరునామా’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. ఏలూరులో ఆదివారం నిర్వహించిన యువగళం సభలో ఆయన ప్రసంగించారు. సభకు వచ్చిన వేల మంది విద్యార్థులతో మూఖాముఖి చర్చలో పాల్గొన్నారు. రాష్ట్ర యువత, ఇతర వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై యువత అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ‘సీఎం ఒక్క ఛాన్సు అంటూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో యువతను మోసగించారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తానన్నారు. అయిదేళ్లలో ఆ ఊసే లేకుండా చేశారు. తెదేపా హయాంలో 6 లక్షల ఉద్యోగాలిచ్చాం. 32 వేల పెండింగ్‌ ఉద్యోగాలు భర్తీ చేశాం. 2.35 లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చి 1.35 లక్షల ఉద్యోగాలు ఇప్పించాం. వైకాపా పాలనలో కొత్తవి రాకపోగా.. అమరరాజా, రిలయన్స్‌, జాకీ వంటి ప్రముఖ కంపెనీలు రాష్ట్రం వదిలి పారిపోయాయి. తెదేపా వచ్చాక విద్యా విధానంలో సంస్కరణలు తీసుకొస్తాం. పాఠ్యాంశాలు మారుస్తాం. మెగా డీఎస్సీపై తొలి సంతకం పెట్టి పెండింగ్‌ పోస్టులు భర్తీ చేస్తాం’ అని తెలిపారు. ‘మీ భూములు లాక్కునేందుకు వైకాపా ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అనే నల్లచట్టాన్ని తీసుకొస్తోంది. మీ బిడ్డను కదా భూమి నాదే అంటూ జగన్‌ మొత్తం లాక్కుంటారు. మీ తాతలు, తండ్రులు సంపాదించిన పొలాల్లో సర్వే రాళ్లు వేసి వాటిపై కూడా జగన్‌ ఫొటోలు వేసుకుంటున్నారు. తెదేపా అధికారంలోకి రాగానే రెండో సంతకం ఈ యాక్టును రద్దు చేయడానికి పెడతాం’ అని లోకేశ్‌ హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img