icon icon icon
icon icon icon

జగన్‌ నోటికి ఫెవికాల్‌ పెట్టుకొని.. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టుపెట్టారు

సీఎం జగన్‌ నోటికి ఫెవికాల్‌ పెట్టుకొని, ఐదేళ్లుగా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు బృందా కారాట్‌ విమర్శించారు.

Published : 06 May 2024 05:45 IST

బృందా కారాట్‌ ధ్వజం

శ్రీకాకుళం (కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: సీఎం జగన్‌ నోటికి ఫెవికాల్‌ పెట్టుకొని, ఐదేళ్లుగా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు బృందా కారాట్‌ విమర్శించారు. ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో ప్రచారం చేసి, అక్కడి నుంచి శ్రీకాకుళం నగరం వచ్చి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతు, కార్మిక వ్యతిరేక చట్టాల గురించి వైకాపా ఎంపీలు పార్లమెంటులో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఆ పార్టీని వచ్చే ఎన్నికల్లో ఓడించాలన్నారు. జిల్లాలో వంశధార రిజర్వాయర్‌ పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేశారని, అణువిద్యుత్తు కేంద్రం ఏర్పాటు చేయడం అంటే అణుబాంబు పెట్టడమేనన్నారు. జీడికి మద్దతు ధర అందించకుండా తీవ్ర దోపిడీకి గురి చేశారన్నారు. రెండు దశల ఎన్నికల్లో భాజపా టైర్‌ పంక్చర్‌ అయిందని, దేశంలో ఇండియా ఫోరం అధికారంలోకి వస్తుందని తెలిపారు. ప్రధాని మోదీ విద్వేష ప్రసంగాలు ఆపాలన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర నాయకులు సీహెచ్‌.నరసింగరావు, జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, నాయకులు కె.నాగమణి, బి.కృష్ణమూర్తి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img