logo

కోలాహలంగా ఎరిక్షన్‌బాబు నామినేషన్‌

యర్రగొండపాలెం తెదేపా ఉమ్మడి అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు శుక్రవారం నామినేషన్‌ వేశారు.

Published : 20 Apr 2024 02:54 IST

ర్యాలీ చేపట్టిన శ్రేణులు
భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు

యర్రగొండపాలెంలో ఎరిక్షన్‌బాబు, మాగుంటకు బ్రహ్మరథం పట్టిన జనం

యర్రగొండపాలెం పట్టణం, బేస్తవారపేట, కంభం, మార్కాపురం  పొదిలి గ్రామీణం, : యర్రగొండపాలెం తెదేపా ఉమ్మడి అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు శుక్రవారం నామినేషన్‌ వేశారు. తెదేపా కార్యాలయం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి ఎరిక్షన్‌బాబు, ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, మన్నెరవీంద్రలు ర్యాలీగా  ఆర్వో కార్యాలయానికి వెళ్లారు. యువత మోటార్‌ సైకిల్‌ ర్యాలీ చేపట్టారు. ‌

  • బేస్తవారపేట మండలంలోని పెంచికలపాడు, మోక్షగుండం, పూసలపాడు గ్రామాల్లో ముత్తుముల అశోక్‌రెడ్డి తనయుడు దివ్యేష్‌ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ‌
  • రాచర్ల మండలం పలుగుంటిపల్లిలో అశోక్‌రెడ్డి  సోదరి గీత ప్రచారం నిర్వహించారు.‌

మాట్లాడుతున్న ఎంపీ శ్రీనివాసులరెడ్డి, పక్కన మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి, తదితరులు

మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి నివాసం వద్ద కూటమి ఆధ్వర్యంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

కంభం : తెదేపాలో చేరిన అర్థవీడు మండలం వాసులతో అశోక్‌రెడ్డి

తెదేపాలో చేరికల వెల్లువ : పొదిలి మండలం తలమల్లలో బీసీ వర్గాలకు చెందిన 100 వైకాపా కుటుంబాలు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ‌

  • యర్రగొండపాలెం తెదేపా కార్యాలయంలో పాలుట్ల,  మానేపల్లె, అయ్యగానిపల్లె, వై.పాలెం, గారెపెంట, మురారిపల్లెకు చెందిన 135 కుటుంబాలు ఎరిక్షన్‌బాబు, మాగుంట శ్రీనివాసరెడ్డి సమక్షంలో తెదేపాలో చేరాయి. ‌
  • గిద్దలూరు మండలంలోని బురుజుపల్లె తండాకు చెందిన 60 కుటుంబాలు,  అర్థవీడు మండలం అంకభూపాలెం గ్రామానికి చెందిన 20 కుటుంబాలు అశోక్‌రెడ్డి సమక్షంలో తెదేపాలో చేరాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని