logo

రాజుకున్న ఎన్నికల వేడి

సార్వత్రిక ఎన్నికల వేడి రోజు రోజుకూ పెరుగుతోంది. నామినేషన్ల పర్వం రెండో రోజైన శుక్రవారం.. భారీ ప్రదర్శనలతో జిల్లా వ్యాప్తంగా సందడి నెలకొంది.

Published : 20 Apr 2024 03:05 IST

రెండో రోజు 15 నామినేషన్ల దాఖలు

వాహనంపై ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు మాగుంట, ఎరిక్షన్‌బాబు, నేతలు

సార్వత్రిక ఎన్నికల వేడి రోజు రోజుకూ పెరుగుతోంది. నామినేషన్ల పర్వం రెండో రోజైన శుక్రవారం.. భారీ ప్రదర్శనలతో జిల్లా వ్యాప్తంగా సందడి నెలకొంది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు సంబంధించి మొత్తం 15 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీల వారీగా ప్రధాన పార్టీల నుంచి యర్రగొండపాలెం గూడూరి ఎరిక్షన్‌బాబు(తెదేపా, యర్రగొండపాలెం), కొండపి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి(తెదేపా, కొండపి), గిద్దలూరు ముత్తుముల అశోక్‌రెడ్డి(తెదేపా, గిద్దలూరు); కుందురు నాగార్జునరెడ్డి(వైకాపా, గిద్దలూరు) నామినేషన్లు దాఖలు చేశారు. గొట్టిపాటి లక్ష్మి(తెదేపా, దర్శి), బీఎన్‌.విజయ్‌కుమార్‌(తెదేపా, సంతనూతలపాడు), ఆదిమూలపు సురేష్‌(వైకాపా, కొండపి) తరఫున ఇతరులు నామినేషన్లు దాఖలు చేశారు. ఒంగోలు పార్లమెంట్‌తో పాటు, కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండో రోజు ఒక్కటి కూడా దాఖలు కాలేదు.  

న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం

వాహనం పైనుంచి విజయ సంకేతం చూపుతున్న స్వామి, నేతలు రాఘవ్‌రెడ్డి, సత్య

వై.పాలెం: నామినేషన్‌ దాఖలు ర్యాలీలో భారీగా పాల్గొన్న తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలు

కొండపి: నామినేషన్‌ దాఖలుకు పెద్దసంఖ్యలో తరలివచ్చిన కూటమి శ్రేణులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని