logo

నాలుగో రోజు 42 మంది నామపత్రాల దాఖలు

ఒంగోలు పార్లమెంట్‌తోపాటు, జిల్లా వ్యాప్తంగా ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు సంబంధించి నాలుగో రోజైన సోమవారం 42 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు.

Published : 23 Apr 2024 04:52 IST

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఒంగోలు పార్లమెంట్‌తోపాటు, జిల్లా వ్యాప్తంగా ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు సంబంధించి నాలుగో రోజైన సోమవారం 42 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. అభ్యర్థులతో పాటు వారి తరఫున మరికొందరు ఆర్వోలకు అందజేశారు. ఒంగోలు ఎంపీ స్థానానికి మాగుంట శ్రీనివాసులురెడ్డి, మాగుంట గీతాలత (తెదేపా), కోట సూర్యతేజ (పిరమిడ్‌ పార్టీ), సింగమనేని శ్రీకాంత్‌ (స్వతంత్ర); యర్రగొండపాలెం అసెంబ్లీకు తేళ్ల హెబ్సీరాణి (లిబరేషన్‌ కాంగ్రెస్‌); తాటిపర్తి చంద్రశేఖర్‌ (వైకాపా); కె.పిచ్చయ(బీఎస్పీ), బూదాల అజితారావు (కాంగ్రెస్‌) నామపత్రాలందజేశారు. దర్శికి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి(వైకాపా), గొట్టిపాటి లక్ష్మి(తెదేపా); సంతనూతలపాడుకు మేరుగు నాగార్జున (వైకాపా), పాలపర్తి  విజేష్‌రాజ్‌ (కాంగ్రెస్‌), కైలా వెంకటరావు (బీఎస్పీ); ఒంగోలుకు  బాలినేని శ్రీనివాసరెడ్డి (వైకాపా), బాలినేని ప్రణీత్‌రెడ్డి (వైకాపా), కొండపికి ఆదిమూలపు విశాల్‌, ఆదిమూలపు సురేష్‌ (వైకాపా); మార్కాపురంలో అన్నా వెంకట రాంబాబు(వైకాపా), షేక్‌  సైదా (కాంగ్రెస్‌), కందుల నారాయణరెడ్డి (తెదేపా), కనిగిరిదద్దాల నారాయణ(వైకాపా), ముక్కు ఉగ్రనరసింహారెడ్డి (తెదేపా)తోపాటు, పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని