logo

వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు

వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు.

Published : 25 Apr 2024 02:43 IST

ఇళ్లకు వెళ్లి మరీ తీసుకొస్తున్న వైకాపా నాయకులు

ముండ్లమూరు: రాజీనామా పత్రాలు ఎంపీˆడీవో శంకరరావుకు అందజేస్తున్న వాలంటీర్లు

ముండ్లమూరు, న్యూస్‌టుడే: వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్న నేపథ్యంలో వారు తప్పుకుంటున్నారు. బుధవారం ముండ్లమూరు మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి బి.శంకరరావుకు వివిధ గ్రామాల్లో పనిచేస్తున్న 70మంది రాజీనామాలు సమర్పించారు. వైకాపా నాయకులు కార్లలో తీసుకొచ్చి మరీ చేయించారు. పలువురు స్పందించకపోడంతో, ఇంటికి వెళ్లి మరీ కార్లలో తీసుకురావడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. జడ్పీటీసీˆ సభ్యుడు టీఎం.రత్నరాజు, మండల ఐకాస కన్వీనరు మేడికొండ జయంతి దగ్గురుండి మరీ పత్రాలు ఎంపీˆడీవోకు అందజేశారు.

దొనకొండ: మండలంలోని ఆరవల్లిపాడు, వద్దిపాడు, రామాపురం, రుద్రసముద్రం గ్రామాల్లోని 34 మంది వాలంటీర్లు బుధవారం రాజీనామాలు చేశారు. తమ ప్రభుత్వం వస్తే రాజీనామా చేయనివారిపై కఠినంగా ఉంటామని హెచ్చరిస్తున్నారని వారు వాపోయారు.

దర్శి: రాజంపల్లిలో పనిచేస్తున్న 20 మంది, పాపిరెడ్డిపాలెంలో విధులు నిర్వర్తిస్తున్న ఏడుగురు రాజీనామాలు చేశారు. వాటిని ఎంపీడీవో హనుమంతరావుకు సమర్పించారు. వారితో ప్రచారం నిర్వహించాలన్న ఎత్తుగడతో ఈ రాజీడ్రామాలు నడుస్తున్నాయి.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని