logo

పుష్ప ప్రదర్శన నేటి నుంచి

మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి జయంతిని పురస్కరించుకుని చెన్నై తేనాంపేట కెథిడ్రల్‌ రోడ్‌లోని సెమ్మొళి పార్కులో పుష్ప ప్రదర్శన నిర్వహించనున్నారు.

Published : 03 Jun 2023 00:43 IST

టీనగర్‌, న్యూస్‌టుడే: మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి జయంతిని పురస్కరించుకుని చెన్నై తేనాంపేట కెథిడ్రల్‌ రోడ్‌లోని సెమ్మొళి పార్కులో పుష్ప ప్రదర్శన నిర్వహించనున్నారు. శనివారం ప్రారంభం కానున్న ఈ ప్రదర్శన 5వ తేదీ వరకు జరుగనుంది. ఉదయం 9- రాత్రి 8 గంటల వరకు సందర్శకులను అనుమతించనున్నారు. ఊటీ, మైసూరు సహా పలు ప్రాంతాల నుంచి రకరకాల పూలను వేల సంఖ్యలో తీసుకొచ్చి వివిధ రూపాలను కళాకారులు అందంగా తీర్చిదిద్దారు. ఉద్యాన శాఖ తరపున శనివారం నుంచి మూడు రోజులపాటు నిర్వహించే ఈ ప్రదర్శనను వీక్షించేందుకు పెద్దలకు రూ.50, పిల్లలకు రూ.20 వంతున రుసుముగా నిర్ణయించారు.

పువ్వులతో వివిధ రూపాలను తీర్చిదిద్దుతున్న కళాకారులు

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు