logo

Trisha: మన్సూర్‌ అలీఖాన్‌పై చర్యలు చేపట్టొద్దు: నటి త్రిష

మన్సూర్‌ అలీఖాన్‌పై చర్యలు చేపట్టొద్దని నటి త్రిష కోరింది. అలీఖాన్‌ కొద్దిరోజుల కిందట త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Updated : 02 Dec 2023 08:13 IST

ప్యారిస్, న్యూస్‌టుడే: మన్సూర్‌ అలీఖాన్‌పై చర్యలు చేపట్టొద్దని నటి త్రిష కోరింది. అలీఖాన్‌ కొద్దిరోజుల కిందట త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. జాతీయ మహిళా కమిషన్‌ సుమోటోగా విచారణకు తీసుకుని ఆయనపై చర్యలు చేపట్టాలని రాష్ట్ర డీజీపీకి ఉత్తర్వులు ఇచ్చింది. థౌజండ్‌ లైట్‌ ఆల్‌ ఉమెన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సమన్లు పంపడంతో ఆయన పోలీస్‌స్టేషన్‌లో దర్యాప్తునకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మన్సూర్‌ అలీఖాన్‌ వ్యాఖ్యలపై త్రిష తరఫున రాతపూర్వక వివరణ కోరుతూ పోలీసులు లేఖ పంపారు. మన్సూర్‌ అలీఖాన్‌ క్షమాపణ చెప్పడంతో ఆయనపై తదుపరి చర్యలు చేపట్టొద్దని త్రిష తరఫున జవాబు అందినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని