logo

అరుణాచలేశ్వరంలో ఛైత్రమాస వసంతోత్సవం

తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో ఛైత్ర మాస వసంతోత్సవం సోమవారం ప్రారంభమైంది. ఈ ఉత్సవాలు 10 రోజుల పాటు జరుగుతాయి.

Published : 16 Apr 2024 00:54 IST

ప్రత్యేక అలంకరణలో ఉన్నాములై సమేత చంద్రశేఖర స్వామి

తిరువణ్ణామలై, న్యూస్‌టుడే: తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో ఛైత్ర మాస వసంతోత్సవం సోమవారం ప్రారంభమైంది. ఈ ఉత్సవాలు 10 రోజుల పాటు జరుగుతాయి. ప్రతిరోజూ అరుణాచలేశ్వర స్వామి ఉన్నాములై అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు అయ్యం కోనేరులో స్వామివారి తీర్థవారి జరుగుతుంది. అదే రోజు రాత్రి 12 గంటలకు 3వ ప్రహారంలోని బంగారు ధ్వజ స్తంభం వద్ద మన్మధ దహనం జరుగుతుంది. శివాలయంలో మన్మధ దహనం జరిగేది ఈ ఆలయ ప్రత్యేకత. తొలిరోజు ఉన్నాములై అమ్మవారికి అరుణాచలేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ, దీపారాధనలు నిర్వహించారు. ఆ తర్వాత ఉత్సవ మూర్తులను ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని