logo

మాజీ మంత్రి ఇంద్రకుమారి మృతి

మాజీ మంత్రి, డీఎంకే సాహిత్య విభాగం అధ్యక్షురాలు ఇంద్రకుమారి(73) మృతి చెందారు. వయోధిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె నగరంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం కన్నుమూశారు.

Published : 17 Apr 2024 01:00 IST

చెన్నై, న్యూస్‌టుడే: మాజీ మంత్రి, డీఎంకే సాహిత్య విభాగం అధ్యక్షురాలు ఇంద్రకుమారి(73) మృతి చెందారు. వయోధిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె నగరంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం కన్నుమూశారు. భౌతికకాయాన్ని అడయారు గాంధీనగర్‌లోని నివాసంలో ఉంచగా పార్టీ ప్రముఖులు పలువురు నివాళి అర్పించారు. మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ సంతాపం ప్రకటించారు. పార్టీకి, సాహిత్య లోకానికి తీరని లోటన్నారు. భౌతికకాయానికి స్టాలిన్‌ నివాళులర్పించారు. 1991 శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన ఇంద్రకుమారి అప్పటి జయలలిత మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రిగా ఐదేళ్లు పనిచేశారు. ‘తొట్టిల్‌ కుళందై’(ఊయల బేబి) పథకం రూపకల్పనలో ముఖ్యపాత్ర పోషించారు. 2006లో ఆ పార్టీ నుంచి వైదొలగి డీఎంకేలో చేరారు. ఆమె భర్త బాబు న్యాయవాది. ఈ దంపతులకు లేఖ అనే కుమార్తె ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని