logo

రోడ్డులేక.. నడకమార్గంలో..

నామక్కల్‌ జిల్లా రాశిపురం తాలూకా వెణ్ణత్తూర్‌ పంచాయతీ యూనియన్‌ పరిధిలోని బోదమలై 7 కి.మీ. ఎత్తులో ఉంది. ఇక్కడి కీళూర్‌, మేలూర్‌, కెడమలై గ్రామాల్లో 1,500 మందికి పైగా జనాభా ఉన్నారు.

Published : 19 Apr 2024 00:04 IST

ఈవీఎంలు మోసుకెళ్లిన ఎన్నికల సిబ్బంది 

బోదమలైకి ఈవీఎంలు మోసుకువెళ్తున్న దృశ్యం

విల్లివాక్కం, న్యూస్‌టుడే: నామక్కల్‌ జిల్లా రాశిపురం తాలూకా వెణ్ణత్తూర్‌ పంచాయతీ యూనియన్‌ పరిధిలోని బోదమలై 7 కి.మీ. ఎత్తులో ఉంది. ఇక్కడి కీళూర్‌, మేలూర్‌, కెడమలై గ్రామాల్లో 1,500 మందికి పైగా జనాభా ఉన్నారు. రోడ్డు సౌకర్యం లేదు. గతుకుల దారిలోనే రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం రూ.140 కోట్లతో రోడ్డు పనులు జరుగుతున్నాయి. శుక్రవారం నాటికి లోక్‌సభ ఎన్నికలకు కీళూలర్‌, కెడమలైలో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కీళూలర్‌లో 428 మంది పురుషులు, 417 మంది మహిళా ఓటర్లున్నారు. కెడమలైలో 159 మంది పురుషులు, 138 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. గురువారం ఉదయం కీళూర్‌ పోలింగ్‌ కేంద్రానికి వడుగం సమీపంలోని కొండ కింద భాగం నుంచి 3 ఈవీఎంలు, వీవీ ప్యాట్‌, కంట్రోల్‌ యూనిట్‌తో జోనల్‌ అధికారి విజయకుమార్‌, సహాయ అధికారి జయకుమార్‌, పోలింగ్‌కేంద్ర అధికారి రాజామణి, ప్రత్యేక ఎస్సై సెంథిల్‌కుమార్‌, హెచ్‌సీ రమేష్‌, పంచాయతీ కార్యదర్శి పరమశివం ప్రజల సాయంతో మోసుకెళ్లారు. కెడమలైకు పుదుప్పట్టి నుంచి ఈవీఎంలను తీసుకెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని