logo

ఏయూ ఆచార్యులకు జాతీయ ర్యాంకులు

‘ఎ.డి. వరల్డ్‌ సైంటిస్ట్స్‌ ర్యాంకింగ్‌ ఇండెక్స్‌-2022’లో పలువురు ఏయూ ఆచార్యులు, విశ్రాంత ఆచార్యులకు ర్యాంకులు లభించాయి. అంతర్జాలంలో వారు పొందుపరిచిన పరిశోధన పత్రాలు, ఇతర వివరాల ఆధారంగా  వారికి స్కోరును

Published : 29 Jun 2022 03:42 IST

సుబ్బారావు

ఈనాడు, విశాఖపట్నం: ‘ఎ.డి. వరల్డ్‌ సైంటిస్ట్స్‌ ర్యాంకింగ్‌ ఇండెక్స్‌-2022’లో పలువురు ఏయూ ఆచార్యులు, విశ్రాంత ఆచార్యులకు ర్యాంకులు లభించాయి. అంతర్జాలంలో వారు పొందుపరిచిన పరిశోధన పత్రాలు, ఇతర వివరాల ఆధారంగా  వారికి స్కోరును నిర్ణయించి ప్రపంచ, జాతీయ, విశ్వవిద్యాలయ స్థాయిల్లో ర్యాంకులను ఖరారు చేశారు. ఏయూ స్థాయిలో మొదటి తొమ్మిది స్థానాల్లో వరుసగా ఆచార్య ఎన్‌.సుబ్బారావు (జాతీయ ర్యాంకు 1,440), ఆచార్య కె.బసవయ్య (3,030), వెంకట రమణమూర్తి కోలపల్లి (3,136), ఆచార్య బి.పార్వతీశ్వరరావు (3,336), ఆచార్య జి.నాగేశ్వరరావు (6,253), ఆచార్య కె.వెంకటసుబ్బయ్య(6,407), ఆచార్య సీహెచ్‌.శ్రీనివాసరావు (7,156), ఆచార్య వి.శ్రీదేవి(8,914), ఆచార్య ఎన్‌.ఎస్‌.శర్మ(8,928)లు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని