logo

భార్యతో గొడవ పడి ఆత్మహత్య

భార్యతో గొడవపడి మనస్తాపం చెందిన భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన 53వ వార్డు మర్రిపాలెం శ్రీనివాస వీధిలో గురువారం చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్టు పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ఒడిశా నవరంగపూర్‌ ప్రాంతానికి చెందిన త్రిపూర్ణ రాంబాబు

Published : 12 Aug 2022 06:07 IST

మాధవధార, న్యూస్‌టుడే: భార్యతో గొడవపడి మనస్తాపం చెందిన భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన 53వ వార్డు మర్రిపాలెం శ్రీనివాస వీధిలో గురువారం చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్టు పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ఒడిశా నవరంగపూర్‌ ప్రాంతానికి చెందిన త్రిపూర్ణ రాంబాబు (42) లారీ డ్రైవర్‌. భార్య లల్లి(40)తో గొడవల కారణంగా గత ఐదేళ్లుగా వేరుగా ఉంటున్నారు. రాంబాబు మాత్రం తల్లి భానుమతి (65), కుమార్తె మనీషా(18) కలిసి మర్రిపాలెంలో నివాసం ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం భార్య లల్లి ఒడిశా నుంచి వీరు నివాసం ఉంటున్న ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గురువారం మధ్యాహ్నం తల్లి, కుమారై బ్యాంకు పని కోసం బయటకు వెళ్లారు. ఆ సమయంలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో రాంబాబు తీవ్ర మనస్తాపంతో ఇంటి లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఎంతకీ బయటకు రాకపోవడంతో కిటికీలోంచి చూడగా ఫ్యాన్‌ హుక్‌కు ఉరేసుకొని ఉన్నాడు. భార్య వెంటనే చుట్టుపక్కల వారి సహాయంతో తలుపు గడియని విరగ్గొట్టి చూడగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. దీంతో ఎయిర్‌పోర్టు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు.
కూతురు ఆత్మహత్యాయత్నం: గొడవల కారణంగా రాంబాబే కుమారైను చిన్ననాటి నుంచీ సాకుతూ వచ్చాడు. ఆమె బాగోగులు అన్నింటినీ అతనే చూసుకునేవాడు. భార్య పెట్టిన కేసులో కొన్ని రోజులపాటు జైలుకు వెళ్లాడు. బెయిల్‌ ఇవ్వడంతో వైజాగ్‌ వచ్చాడు. గత ఆరు నెలలుగా తల్లి, కుమార్తెతో మర్రిపాలెంలో నివాసం ఉంటున్నాడు. మళ్లీ గొడవల కారణంగా తండ్రి ఉరేసుకొని మృతి చెందడంతో కుమార్తె మనీషా తట్టుకోలేక ఆమె కూడా ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించింది. తల్లి, స్థానికులు అడ్డుకొని ఆమెను ఓదార్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని