logo

భూములు అమ్మేస్తాం!

విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) భూములు అమ్మి ఆదాయం పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది.నగర పరిధిలోని అత్యంత డిమాండ్‌ కలిగిన ప్రాంతాల్లోని ప్రధాన రహదారులకు ఆనుకొని ఉన్న స్థలాలను విక్రయానికి ఉంచింది. అయిదు చోట్ల మొత్తంగా 11.22 ఎకరాలను అమ్మకానికి పెట్టగా రూ.200 కోట్ల వరకు ఆదాయం రావొచ్చని అంచనా వేస్తున్నారు. చిన్నచిన్న ప్లాట్లుగా కాకుండా ఆయా ప్రాంతాల్లో ఉన్న వాటిని ఏకమొత్తంగా (బల్క్‌ ల్యాండ్‌)గా

Published : 13 Aug 2022 04:35 IST

రూ.200 కోట్ల ఆదాయంపై వీఎంఆర్‌డీఏ దృష్టి!

ఈనాడు, విశాఖపట్నం

పరవాడ మండలం ఈదులపాక భోనంగి వద్ద వేలానికి ఉంచిన స్థలం

విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) భూములు అమ్మి ఆదాయం పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది.

గర పరిధిలోని అత్యంత డిమాండ్‌ కలిగిన ప్రాంతాల్లోని ప్రధాన రహదారులకు ఆనుకొని ఉన్న స్థలాలను విక్రయానికి ఉంచింది. అయిదు చోట్ల మొత్తంగా 11.22 ఎకరాలను అమ్మకానికి పెట్టగా రూ.200 కోట్ల వరకు ఆదాయం రావొచ్చని అంచనా వేస్తున్నారు. చిన్నచిన్న ప్లాట్లుగా కాకుండా ఆయా ప్రాంతాల్లో ఉన్న వాటిని ఏకమొత్తంగా (బల్క్‌ ల్యాండ్‌)గా విక్రయించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఈ-వేలం పోర్టల్‌ ద్వారా వేలం నిర్వహించనున్నారు. తొలిసారి ఇలా ఆన్‌లైన్‌ బహిరంగ వేలానికి వెళ్తున్నారు. గతంలో వీఎంఆర్‌డీఏ వెబ్‌సైట్‌ ద్వారా ఈ ప్రక్రియ నిర్వహించేవారు.సెప్టెంబరు 6 వరకు దరఖాస్తు చేసుకునేందుకు కొనుగోలుదారులకు అవకాశం కల్పించారు.

అన్నీ డిమాండున్నవే: గతంలో నిర్లక్ష్యానికి గురైన స్థలాలను వీఎంఆర్‌డీఏ స్వాధీనం చేసుకొని వాటిని అభివృద్ధి చేసి విక్రయానికి పెట్టింది. ఇవన్నీ అత్యంత డిమాండున్న ప్రాంతాల్లోవి కావడంతో వేలంలో పోటీ ఎలా ఉండబోతుంది? ఎంత ఆదాయం వస్తుందనేది? అంచనా వేస్తున్నారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలోని ఈదులపాక భోనంగి వద్ద ఒక చోట 4.50 ఎకరాలు, మరో చోట 87 సెంట్ల స్థలాన్ని వేలాని పెట్టారు. ఇవి గాజువాక, స్టీల్‌ప్లాంట్‌ నుంచి పరవాడ మీదుగా అచ్యుతాపురం వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్నాయి. బహరంగ మార్కెట్లో ఇక్కడ ఎకరా రూ. కోట్లలో ధర పలుకుతోంది. దీనికి సమీపంలో కాలనీలు, పవర్‌ సిటీ, ప్రైవేటు లేఅవుట్లు ఉన్నాయి.

*  భీమిలి మండలం చిట్టివలసలో 3.55 ఎకరాలు, కాపులుప్పాడలో 1.66 ఎకరాలు, విశాఖ గ్రామీణ మండలం మధురవాడలోని 64 సెంట్లను విక్రయానికి పెట్టారు. వీటిల్లో పలు ప్రాజెక్టులు, భారీ నిర్మాణాలు, వాణిజ్య సముదాయాలు నిర్మించేందుకు వీలుగా అభివృద్ధి చేశారు.

*  మరికొన్ని భారీ స్థలాల విక్రయానికి వీఎంఆర్‌డీఏ ప్రణాళిక చేస్తోంది. ప్రస్తుతం అయిదింటిని వేలానికి ప్రకటించగా త్వరలో మిథిలాపురికాలనీలో రూ.వంద కోట్ల విలువైన స్థలాన్ని వేలానికి ఉంచనున్నారు. ఇప్పటికే ఎస్టేట్‌ విభాగం ఈ స్థలాన్ని గుర్తించి స్వాధీనంలోకి తీసుకుంది. ఇది వీఎంఆర్‌డీఏకు భారీగా ఆదాయం తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నారు. దీంతో పాటు మరికొన్ని చోట్ల ఉన్న స్థలాలనూ పరిశీలిస్తున్నారు.

*   ఈ స్థలాల వేలంలో ఎవరైనా పాల్గొని కొనుగోలు చేయొచ్చు. ఇవన్నీ రూ. కోట్లలో ధర పలుకుతున్నాయి. దీంతో పరిమిత సంఖ్యలో కొందరు మాత్రమే ముందుకు వచ్చి దక్కించుకునేందుకు అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని