logo

నమ్మండి.. మట్టి కాదు కంకరేనండి!

ఎం.కోడూరు - ఖండివరం మధ్య రూ. కోటి పది లక్షలతో నిర్మిస్తున్న తారురోడ్డు పనుల్లో నాణ్యత ఉండటంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మాడుగుల - ఎం.కోడూరు పరిధిలో తారురోడ్డు పనులు పూర్తి చేసినా రోడ్డుకు ఇరువైపులా కంకర వేస్తున్నారు. ఇది నాణ్యమైనది కాకపోవడం, ఒట్టి మట్టి వేసి

Published : 30 Sep 2022 03:57 IST

రూ. 1.10 కోట్ల పనుల్లో డొల్లతనం

రోడ్డు పక్కన బురదలా మారుతున్న మట్టి

మాడుగుల, న్యూస్‌టుడే: ఎం.కోడూరు - ఖండివరం మధ్య రూ. కోటి పది లక్షలతో నిర్మిస్తున్న తారురోడ్డు పనుల్లో నాణ్యత ఉండటంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మాడుగుల - ఎం.కోడూరు పరిధిలో తారురోడ్డు పనులు పూర్తి చేసినా రోడ్డుకు ఇరువైపులా కంకర వేస్తున్నారు. ఇది నాణ్యమైనది కాకపోవడం, ఒట్టి మట్టి వేసి కంకరగా చెబుతున్నారని అంటున్నారు. వర్షాలు కారణంగా రోడ్డు పక్క వేస్తున్న మట్టి జారి వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల భార్యాభర్తలు వాహనంపై వస్తూ రోడ్డు అంచుల్లో జారి ప్రమాదానికి గురయ్యారని మాడుగులకు చెందిన దాసరి చిన్న తెలిపారు. రహదారి నిర్మాణం మొదట్లోలోనే ఎం.కోడూరు వద్ద కొత్తగా వేసిన రోడ్డు పాడైంది. ఆ గోతులను పూడ్చి సరిచేశారు. రోడ్డుకు ఇరువైపులా వేస్తున్న గ్రావెల్‌ నాణ్యమైనది వేస్తే బాగుండేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై ర.భ. శాఖ జేఈ సాయిశ్రీనివాస్‌ను వివరణకోరగా ఇపుడు గ్రావెల్‌ దొరకడం లేదు అందుకే ఉన్నంతలో వేస్తున్నాం అన్నారు. అయినా దాన్ని సరిచేసి గట్టిపడేలా చేస్తామని చెప్పారు. వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఉండదని, ఉద్యోగిని పంపించి రోడ్డు పనులు పరిశీలన చేయిస్తామన్నారు. మేలురకం గ్రావెల్‌ వేయించడానికి ప్రయత్నిస్తామని జేఈ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని