logo

వైకాపా సర్పంచి వీరంగం

భీమిలి మండల పరిషత్తు సర్వసభ్య సమావేశంలో మంగళవారం వైకాపా మద్దతుదారు, నారాయణరాజుపేట సర్పంచి వీరంగం సృష్టించడంతో ఉద్రిక్తత నెలకొంది.

Published : 01 Feb 2023 05:23 IST

గ్రామీణభీమిలి: భీమిలి మండల పరిషత్తు సర్వసభ్య సమావేశంలో మంగళవారం వైకాపా మద్దతుదారు, నారాయణరాజుపేట సర్పంచి వీరంగం సృష్టించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ సమావేశంలో ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులకు బదులు వారి బంధువులు, భర్తలు వచ్చి మాట్లాడటం ఏమిటని తెదేపా ఎమ్పీటీసీ సభ్యుడు కోరాడ రమణ తొలుత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంపీపీ డి.సూర్యనారాయణరాజు ప్రతిస్పందిస్తూ ‘మీ పంచాయతీ సమస్యలుంటే చెప్పండి..మాపార్టీ నాయకులు సభకొస్తే మీకెందుకు’ అని బదులిచ్చారు. ఆ సమయంలో నారాయణరాజుపేట సర్పంచి సూర్యనారాయణ సంబంధిత ఎమ్పీటీసీ సభ్యుడిపై ఆగ్రహించారు. దీనిని కెమెరాతో చిత్రీకరిస్తున్న విలేకరులపైనా ఆయన కేకలు వేశారు. మరో పక్క వైకాపాకు చెందిన మరో ఇద్దరు సభ్యులు కూడా తెదేపా ఎమ్పీటీసీ సభ్యునితో వాగ్వాదానికి దిగారు. ఈ గొడవ జరిగిన కొద్దిసేపటి తర్వాత సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు దృష్టికి కోరాడ రమణ ఈ సమస్య తీసుకెళ్లారు. ఇక్కడ ప్రొటోకాల్‌ పాటించడం లేదని, అధికారిక సభలకు, సమావేశాలకు తనను పిలవడం లేదని, అభివృద్ధి పనుల సమాచారమూ చెప్పడం లేదంటూ వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని