logo

జనవరి... ఉక్కు రికార్డుల ఝరి..!

జనవరి నెలలో విశాఖ ఉక్కు కర్మాగారం అద్భుతమైన పనితీరుతో కొత్త రికార్డులు నమోదు చేసినట్టు ఉక్కువర్గాలు తెలిపాయి.

Published : 05 Feb 2023 02:47 IST

ఉక్కునగరం(గాజువాక), న్యూస్‌టుడే : జనవరి నెలలో విశాఖ ఉక్కు కర్మాగారం అద్భుతమైన పనితీరుతో కొత్త రికార్డులు నమోదు చేసినట్టు ఉక్కువర్గాలు తెలిపాయి. గత ఏడాది ఇదే నెలతో పోల్చితే బ్లాస్ట్‌ఫర్నెస్‌-1(గోదావరి) 25 శాతం వృద్ధితో 2,35,985 టన్నుల హాట్‌మెటల్‌ను ఉత్పత్తి చేసింది. స్ట్రక్చరల్‌ మిల్‌ 81 శాతం వృద్ధితో 64,885 టన్నుల ఉత్పత్తులు, వై రాడ్‌మిల్‌-2, స్పెషల్‌ బార్‌ మిల్‌లో 1,75,094 టన్నుల ఫినిష్డ్‌ స్టీల్‌ ఉత్పత్తి అయినట్టు అధికారులు ప్రకటించారు. కర్మాగారం ప్రారంభం నుంచి యూనిట్ల వారీగా ఏ నెలలోనూ సాధించని రికార్డులు నమోదయ్యాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని