logo

రూ.50 కోట్లతో క్యాన్సర్‌ విభాగం బలోపేతం

కేజీహెచ్‌లో క్యాన్సర్‌ విభాగం బలోపేతం చేయడానికి రూ.50కోట్లతో ఆధునిక పరికరాలను కొనుగోలు చేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖల మంత్రి విడదల రజిని అన్నారు.

Published : 05 Feb 2023 02:47 IST

మంత్రి విడదల రజిని

కేజీహెచ్‌లో అభివృద్ధి పనుల శిలాఫలకం ఆవిష్కరిస్తున్న మంత్రి విడదల రజిని, చిత్రంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్‌, కలెక్టర్‌ మల్లికార్జున, వైద్యాధికారులు అశోక్‌కుమార్‌, బుచ్చిరాజు తదితరులు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: కేజీహెచ్‌లో క్యాన్సర్‌ విభాగం బలోపేతం చేయడానికి రూ.50కోట్లతో ఆధునిక పరికరాలను కొనుగోలు చేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖల మంత్రి విడదల రజిని అన్నారు. శనివారం కేజీహెచ్‌ సీఎస్‌ఆర్‌ బ్లాక్‌ క్యాన్సర్‌ విభాగంలో కొత్తగా ఏర్పాటు చేసిన పిల్లలు, రక్త క్యాన్సర్‌, ఉపశమన విభాగాలను ఆమె ప్రారంభించారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద రూ.1.25కోట్లతో రాజేంద్రప్రసాద్‌ వార్డులో ఏర్పాటు చేసిన ఎ.ఎం.సి.యు-2, వృద్ధుల వార్డులు, ఓపీ విభాగంలో నవీకరించిన ఓపీ చీటీల కౌంటర్లు, వీఎంఆర్‌డీఏ సహాయంతో అందుబాటులోకి తెచ్చిన ఫౌంటెయిన్‌, రోగుల సహాయకులకు ఏర్పాటు చేసిన బల్లలను మంత్రి రజిని, ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్‌, కలెక్టర్‌ ఎ.మల్లికార్జున శనివారం మధ్యాహ్నం ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ క్యాన్సర్‌ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఇప్పటికే ప్రభుత్వం అగనంపూడిలోని హోమీబాబా క్యాన్సర్‌ ఆసుపత్రిలో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు. కేజీహెచ్‌లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ మాట్లాడారు. కార్యక్రమంలో వీఎంఆర్‌డీఏ ఛైర్‌పర్సన్‌ అక్కరమాని విజయనిర్మల, కేజీహెచ్‌ పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్‌ పి.అశోక్‌కుమార్‌, ఏఎంసీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జి.బుచ్చిరాజు, క్యాన్సర్‌ విభాగ ప్రొఫెసరు డాక్టర్‌ రవిమోహన్‌, సహ ప్రొఫెసరు డాక్టర్‌ శిల్ప, ఉప పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్‌ రాధాకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని