logo

పతనావస్థలో రాష్ట్ర ప్రాథమిక విద్యా వ్యవస్థ

ఉపాధ్యాయులంతా నిత్య చైతన్యవంతులుగా ఉండాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి డి.వి.రాఘవులు పేర్కొన్నారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యూటీఎఫ్‌) జిల్లా కౌన్సిల్‌ సమావేశం ఆదివారం అనకాపల్లిలో జరిగింది.

Published : 27 Mar 2023 03:55 IST

యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రాఘవులు

సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర కార్యదర్శి రాఘవులు

నెహ్రూచౌక్‌ (అనకాపల్లి), న్యూస్‌టుడే: ఉపాధ్యాయులంతా నిత్య చైతన్యవంతులుగా ఉండాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి డి.వి.రాఘవులు పేర్కొన్నారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యూటీఎఫ్‌) జిల్లా కౌన్సిల్‌ సమావేశం ఆదివారం అనకాపల్లిలో జరిగింది. రాఘవులు మాట్లాడుతూ విద్యా రంగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తిరోగమన నిర్ణయాలను వ్యతిరేకించాలని కోరారు. ప్రభుత్వాల తొందరపాటు నిర్ణయాల వల్ల రాష్ట్రంలో ప్రాథమిక విద్యా వ్యవస్థ పతనావస్థలో ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కాంట్రిబ్యూటరీ పింఛను పథకం (సీపీఎస్‌) రద్దు చేయకుండా మాట తప్పారని విమర్శించారు. ప్రత్యామ్నాయ పద్ధతులు కాకుండా ఇచ్చిన మాట ప్రకారం పాత పింఛను విధానాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.  ఉపాధ్యాయులను పాఠ్యాంశాల బోధనకే పరిమితం చేయాలన్నారు. సమావేశం అనంతరం యూటీఎఫ్‌ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా నెల్లి సుబ్బారావు, అధ్యక్షులుగా వత్సవాయి శ్రీలక్ష్మి, కార్యదర్శిగా గొంది చిన్నబ్బాయ్‌, కోశాధికారిగా రాజేశ్‌తోపాటు మరో 13 మంది కార్యవర్గ సభ్యులు ఎంపికయ్యారు. కట్టా శ్రీనివాసరావు, జి.వి.పి.ఎస్‌.లక్ష్మి, గుత్తల సూర్యప్రకాష్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని