logo

అగ్రిల్యాబ్‌ల్లో ఇకపై భూసార పరీక్షలు

భూసార పరీక్షలకు అనుగుణంగానే రైతులు ఎరువులు వినియోగించేలా చూడాలని అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏడీఆర్‌ డాక్టర్‌ పి.వి.కె.జగన్నాథరావు కోరారు

Published : 01 Apr 2023 06:57 IST

అనకాపల్లి, న్యూస్‌టుడే: భూసార పరీక్షలకు అనుగుణంగానే రైతులు ఎరువులు వినియోగించేలా చూడాలని అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏడీఆర్‌ డాక్టర్‌ పి.వి.కె.జగన్నాథరావు కోరారు. భూసార పరీక్షలు నిర్వహించే విధానంపై విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన వ్యవసాయాధికారులకు శుక్రవారం శాస్త్రవేత్తలు శిక్షణ ఇచ్చారు. స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్యక్రమానికి జగన్నాథరావు అధ్యక్షత వహించారు. భూసార పరీక్ష కేంద్రం జిల్లా అధికారి ప్రసాద్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ప్లాంట్‌ డాక్టర్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తుందన్నారు. అగ్రి ల్యాబ్‌ల్లో ఇంతవరకు విత్తనం, ఎరువుల పరీక్షలు చేసేవారని, ఇకపై భూసార పరీక్షలూ చేస్తారని తెలిపారు. ఇందులో భాగంగానే వ్యవసాయాధికారులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. అనంతరం కేంద్రంలోని ప్రయోగశాలలో మట్టి పరీక్షలు చేసే విధానంపై సీనియర్‌ శాస్త్రవేత్తలు రామలక్ష్మి, శిరీష శిక్షణ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని