logo

ఎన్నికల బహిష్కరణకే ‘తాడి’ నిర్ణయం

పరవాడ ఫార్మాసిటీ కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించకుండా ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని దీనికి నిరసనగా త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలను మూకుమ్మడిగా గ్రామస్థులంతా బహిష్కరిస్తున్నట్లు గ్రామ ప్రజలు, అఖిలపక్ష నాయకులు ఏకగ్రీవ తీర్మానం చేశారు

Updated : 29 Mar 2024 04:23 IST

 ఎన్నికల బహిష్కరణకే ‘తాడి’ నిర్ణయడీఆర్వో దయానిధికి తీర్మానం పత్రాలను అందజేస్తున్న తాడి గ్రామస్థులు, నాయకులు

వాడ, న్యూస్‌టుడే: పరవాడ ఫార్మాసిటీ కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించకుండా ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని దీనికి నిరసనగా త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలను మూకుమ్మడిగా గ్రామస్థులంతా బహిష్కరిస్తున్నట్లు గ్రామ ప్రజలు, అఖిలపక్ష నాయకులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ మేరకు తీర్మాన పత్రాలను గురువారం అనకాపల్లి జిల్లా డీఆర్వో దయానిధికి అందజేశారు. గత 15 ఏళ్లుగా ప్రభుత్వాలు మారుతున్నా తమ సమస్యను పట్టించుకోకుండా మోసం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఎన్నికల ముందు రాజకీయ పార్టీల నాయకులు వచ్చి గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించి ఫార్మా కాలుష్యం నుంచి విముక్తి కల్పిస్తామని హామీలు గుప్పిస్తున్నారని, తీరా గెలిచిన తర్వాత పట్టించుకోకుండా ముఖం చాటేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్యం వల్ల ప్రజలు వ్యాధుల బారిన పడి ఆర్థికంగా కుంగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాదంశెట్టి నీలబాబు, మాజీ సర్పంచి బొడ్డపల్లి అప్పారావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ, నాయకులు పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని