logo

గంగవరం పోర్టులో అమలుకాని కార్మిక చట్టాలు

అదానీ గంగవరం పోర్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి డిమాండ్‌ చేశారు.

Published : 19 Apr 2024 04:37 IST

మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి, చిత్రంలో జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు

అల్లిపురం, న్యూస్‌టుడే: అదానీ గంగవరం పోర్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి డిమాండ్‌ చేశారు. అల్లిపురం దరి సీపీఐ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గంగవరం పోర్టులో కార్మిక చట్టాలు అమలు కావడం లేదన్నారు. కలెక్టర్‌ మల్లికార్జున సమక్షంలో కుదరిన ఒప్పందాన్ని యాజమాన్యం తుంగలో తొక్కిందన్నారు. ఉక్కులో కోకో ఓవెన్‌ బ్యాటరీలకు కుకింగ్‌ కోల్‌ సరఫరా తగ్గితే కార్బన్‌ మోనాక్సైడ్‌ వాయువు వెలువడే ప్రమాదం ఉందన్నారు. ఇదే జరిగితే చుట్టుపక్కల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు మన్మథరావు, ప్రధాన కార్యదర్శి జి.ఎస్‌.జె.అచ్యుతరావు, ఉపాధ్యక్షుడు కసిరెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని