కంటికి వెలుగు
సర్వేంద్రియానాం.. నయనం ప్రధానం అన్నారు.. అవయవాల్లో కంటికి అంతటి ప్రాధాన్యం ఉంది. మరి కళ్లకు జబ్బు చేస్తే వైద్యం చేయించుకోవడం పేదలకు భారమే.
శిబిరాల ఏర్పాటు, బాధితుల గుర్తింపునకు కసరత్తు
సర్వేంద్రియానాం.. నయనం ప్రధానం అన్నారు.. అవయవాల్లో కంటికి అంతటి ప్రాధాన్యం ఉంది. మరి కళ్లకు జబ్బు చేస్తే వైద్యం చేయించుకోవడం పేదలకు భారమే. దీనిని దృష్టిలో పెట్టుకున్న సర్కారు 2018 ఆగస్టు 15న కంటి వెలుగు పథకానికి శ్రీకారం చుట్టింది. ఊరూరా నేత్ర పరీక్షలు చేయించింది.. అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేయించడంతో పాటు అద్దాలు అందించింది. తర్వాత 2019 మార్చిలో కొన్ని కారణాలతో పథకాన్ని నిలిపివేసింది. కరోనా అనంతరం చాలా మందిలో కంటి సమస్యలు వెలుగుచూశాయి. ఈ క్రమంలో మళ్లీ పథకాన్ని పునఃప్రారంభించాలని నిర్ణయించింది.
ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: కరోనా అనంతరం అత్యధికంగా పెరిగిన సమస్యలో కంటిచూపు ఒకటి. ఆన్‌లైన్ చదువులతో పిల్లల్లో ఎక్కువ కనిపించగా, పెద్దల్లో బ్లాక్ ఫంగస్ కారణంగా కంటి జబ్బులు ఏర్పడ్డాయి. ఈ కారణాన్నే చూపుతూ ప్రభుత్వం 2023 జనవరి 18న రెండోవిడత కంటివెలుగు వైద్యశిబిరాలను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైద్యశిబిరాలు నిర్వహించడానికి అవసరమైన ప్రతిపాదనలను ఇప్పటికే వైద్యాధికారులు పంపించారు. వరంగల్‌లోని ప్రాంతీయ నేత్ర వైద్యశాలకు నిత్యం 300 మందిపైగా వస్తున్నారు. ప్రతిరోజూ 30 శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో సుమారు 15 లక్షల మందికిపైగా కంటి సమస్యతో బాధపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
హనుమకొండ, వరంగల్, ములుగు, జయశంకర్, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో నేత్ర శిబిరాల నిర్వహణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో బృందంలో నలుగురు సిబ్బంది ఉంటారు. ఒక ఆప్తాల్మిక్ అధికారి, ఇద్దరు ఆప్టోమేట్రిస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారు. స్థానికంగా పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది సహకారంతో ఒక బృందం ప్రతి రోజు కనీసం 200 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించేలా ప్రతిపాదనలు తయారు చేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదటి విడత నిర్వహించిన కంటివెలుగులో 19,07,005 మందికి పరీక్షలు చేశారు. 2,55,413 మందికి అద్దాలు పంపిణీ చేశారు.
సాధారణంగా 40 ఏళ్లు దాటిన వారిలో దగ్గర, దూరపు చూపు కనిపించదు. అదేవిధంగా కండ్లకలక, చత్వారం, ట్రకోమా గ్లకోమాతో పాటు విటమిన్-ఏ లోపంతో వచ్చే రేచీకటి, చూపుమందగించేలా చేసే శుక్లం(కంటిపొర) వంటి సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి వారిని కంటివెలుగు శిబిరాలలో గుర్తిస్తారు. గ్లకోమా, కంటిపొరలున్న వారికి శస్త్రచికిత్సలు చేయడానికి జిల్లా ఆసుపత్రులకు సిఫారసు చేస్తారు. దూరం, దగ్గర చూపు సమస్య ఉన్నవారికి అద్దాలు ఇస్తారు. వచ్చే ఏడాదిలో నిర్వహించే శిబిరాలలో మెరుగైన చికిత్సలు అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.ప్రజల్లో విశ్వాసం పెంచాలి.
సిద్ధంగా ఉన్నాం:
డాక్టర్ సాంబశివరావు, డీఎంహెచ్‌వో, హనుమకొండ
ప్రభుత్వ ఆదేశం మేరకు కంటి శిబిరాల నిర్వహణకు ప్రత్యేక వైద్యబృందాలను ఏర్పాటు చేస్తున్నాం. గతంలో కంటి వెలుగు శిబిరాల్లో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే సిబ్బందికి శిక్షణ అందిస్తాం. వైద్యపరికరాలు, అద్దాలు, ఇతర సౌకర్యాలను సమకూర్చుకుంటాం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Pakistan: పాక్‌లో ఘోర ప్రమాదం.. 42మంది మృత్యువాత
-
General News
KTR: అమెరికాలో సదస్సుకు మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం
-
India News
Beating Retreat: సైనిక విన్యాసాలు భళా.. 3,500 డ్రోన్లతో మెగా షో.. వీక్షించండి
-
Sports News
Djokovic: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023.. జకోవిచ్ ఖాతాలో పదో టైటిల్.. మొత్తంగా 22వ గ్రాండ్‌స్లామ్
-
General News
Harish Rao: వైద్యరంగంలో మనం దేశానికే ఆదర్శం: హరీశ్‌రావు
-
General News
Srisailam: శ్రీశైలం ఘాట్రోడ్లో రక్షణ గోడను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం